News April 24, 2024

అయోధ్యను 1.5కోట్ల మంది సందర్శించారు: ట్రస్ట్

image

జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్య రామమందిరాన్ని 1.5కోట్ల సందర్శించారని రామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ప్రతి రోజు సుమారు లక్షమందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆలయ ప్రారంభోత్సవానికి దేశ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.

Similar News

News January 29, 2026

దూబే ‘బ్యాడ్ లక్’.. లేదంటేనా!

image

NZతో 4వ T20లో IND బ్యాటర్ దూబే దురదృష్టకర రీతిలో ఔటయ్యారు. స్ట్రైక్‌లో ఉన్న హర్షిత్ బంతిని స్ట్రెయిట్‌గా ఆడటంతో అది బౌలర్ చేతికి తగిలి వికెట్లకు తాకింది. దీంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో క్రీజు బయటకొచ్చిన దూబే రనౌటయ్యారు. 15 బంతుల్లో 50, మొత్తం 23 బంతుల్లో 65 రన్స్ చేసిన దూబే ఇంకాసేపు క్రీజులో ఉండుంటే IND గెలిచేదేమో. కాగా T20Isలో IND తరఫున ఇది మూడో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. TOP2లో యువీ(12), అభి(14) ఉన్నారు.

News January 29, 2026

పిల్లలకు SM బ్యాన్‌పై విధివిధానాలు రూపొందించండి: మంత్రి లోకేశ్

image

AP: మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయంపై విధివిధానాలను రూపొందించాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. ‘సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై మంత్రులతో జరిగిన మీటింగ్‌లో చర్చించాం. చిన్నారులకు SMను నిషేధించే అంశంపై సింగపూర్, AUS, మలేషియా, ఫ్రాన్స్‌లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, ఫేక్ పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించా’ అని ట్వీట్ చేశారు.

News January 29, 2026

టీమ్‌ఇండియా ఓటమి.. సూర్య ఏమన్నారంటే?

image

NZతో <<18988305>>4th T20లో<<>> కావాలనే ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు పర్ఫెక్ట్ బౌలర్లతో బరిలోకి దిగామని IND కెప్టెన్ సూర్య తెలిపారు. ‘మమ్మల్ని మేము ఛాలెంజ్ చేసుకున్నాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు బాగా ఆడుతున్నాం. ఛేజింగ్‌లో 2, 3 వికెట్లు త్వరగా పడితే ఎలా ఆడతారో చూడాలనుకున్నాం. నెక్స్ట్ మ్యాచులోనూ ఛేజింగ్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా. దూబేకి తోడుగా ఇంకో బ్యాటర్ ఉండుంటే ఫలితం వేరేలా ఉండేది’ అని పేర్కొన్నారు.