News April 24, 2024

అయోధ్యను 1.5కోట్ల మంది సందర్శించారు: ట్రస్ట్

image

జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్య రామమందిరాన్ని 1.5కోట్ల సందర్శించారని రామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ప్రతి రోజు సుమారు లక్షమందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆలయ ప్రారంభోత్సవానికి దేశ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.

Similar News

News January 16, 2026

ఇంటి సింహద్వారం ఎలా ఉండాలంటే?

image

ఇంటికి సింహద్వారం ఎంతో ప్రధానమైనదని, ఇది ఇంటి యజమాని అభిరుచికి, ఉన్నతికి నిదర్శనమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పేర్కొంటున్నారు. ‘సింహద్వారం ఏ దిశలో ఉన్నా దానికి రెండు వైపులా కిటికీలు ఉండటం శాస్త్రరీత్యా తప్పనిసరి. మిగిలిన ద్వారాల కంటే ఇది ఎత్తులోనూ, వెడల్పులోనూ పెద్దదిగా ఉండాలి. ప్రత్యేకమైన ఆకర్షణతో ఉట్టిపడాలి. అప్పుడే ఆ ఇంటికి నిండుదనం, వాస్తు బలం చేకూరుతాయి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 16, 2026

YTలో పిల్లల స్క్రీన్ టైమ్‌ను నియంత్రించవచ్చు!

image

పిల్లల స్క్రీన్ టైమ్‌ను నియంత్రించేందుకు యూట్యూబ్ ‘పేరెంటల్ కంట్రోల్స్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా పిల్లలు యూట్యూబ్ వీడియోలు చూడకుండా పూర్తిగా బ్లాక్ చేయడం లేదా టైమ్ ఫిక్స్ చేయడం వంటివి చేయవచ్చు. ఈ వీడియోలకు పిల్లలు బానిసలుగా మారుతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో యూట్యూబ్ ఈ మార్పులు తీసుకొచ్చింది. దీంతోపాటు కిడ్స్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసేలా సైన్-అప్ ప్రక్రియను ఈజీ చేసింది.

News January 16, 2026

రక్షణ రంగంలోకి భారీగా FDIలకు అవకాశం!

image

జియో పాలిటిక్స్, పాక్ నుంచి ఉగ్రవాదం నేపథ్యంలో రక్షణ రంగంలోకి భారీగా FDIలకు అవకాశమివ్వాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం అనుమతులతో అవసరం లేని ఆటోమేటిక్ లైసెన్సింగ్ విధానంలో 49% వరకు FDIలకు అవకాశం ఉంది. దీన్ని 74% పెంచనుందని ‘రాయిటర్స్’ పేర్కొంది. భారత భాగస్వామి కంపెనీల్లో విదేశీ రక్షణ సంస్థలకు మెజార్టీ వాటాకు అవకాశం కల్పించనుంది. ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడమే దీని లక్ష్యమని తెలిపింది.