News December 1, 2024
బలవంతంగా మతం మారిస్తే 1-5 ఏళ్ల జైలు శిక్ష

బలవంతపు మతమార్పిడులను అరికట్టేందుకు వీలుగా యాంటీ కన్వర్షన్ బిల్లుకు రాజస్థాన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఎవరైనా బలవంతంగా మతం మారిస్తే 1-5 ఏళ్ల జైలుశిక్ష విధిస్తామని అందులో పేర్కొంది. మత మార్పిడి కోసమే పెళ్లి చేసుకుంటే ఆ వివాహం చెల్లదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇలాంటి తరహా బిల్లులు 8 రాష్ట్రాల్లో ఆమోదం పొందాయి.
Similar News
News February 13, 2025
పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శనాలు

AP: తిరుమల శ్రీవారి భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పర్యాటక శాఖ ద్వారా దర్శన సౌకర్యాలను పునరుద్ధరించాలని CM చంద్రబాబు నిర్ణయించారు. గతంలో ₹300 టికెట్లను వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాలకు, RTCలకు కేటాయించేవారు. వీటిని బ్లాక్లో ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో TTD రద్దు చేసింది. ఇప్పుడు పూర్తిగా AP పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే దర్శనం కల్పించనుంది. విధివిధానాలపై త్వరలో క్లారిటీ రానుంది.
News February 13, 2025
ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోలేదు: విష్ణు

‘కన్నప్ప’ కోసం ఏడేళ్లుగా కష్టపడుతున్నామని, రూ.140 కోట్లతో తెరకెక్కిస్తున్నామని హీరో మంచు విష్ణు తెలిపారు. ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ చిత్రంలో నటించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పారితోషికం గురించి నేను ‘కంప్లీట్ యాక్టర్’ వద్ద ప్రస్తావిస్తే ఆయన నవ్వుతూ ‘నువ్వు అంత పెద్దవాడివయ్యావా’ అని అన్నారన్నారు. డార్లింగ్ వల్ల తనకు స్నేహంపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు.
News February 13, 2025
BREAKING: తోటి సిబ్బందిపై CRPF జవాన్ ఘాతుకం

మణిపుర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంజయ్ కుమార్ అనే CRPF జవాన్ తన సర్వీస్ తుపాకీతో తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు చనిపోగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం తనను తాను కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.