News April 10, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 మంది BRS నేతలు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో 10 మందికిపైగా BRS నేతలు కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. తనకు కీలక పోస్ట్ ఇవ్వడం, రిటైరైనా మరో మూడేళ్లపాటు తన టర్మ్‌ను పొడిగించుకోవడం వెనుక ఉన్న గత ప్రభుత్వ పెద్దల పేర్లను చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించేందుకు దాదాపు 200 ప్రశ్నలను పోలీసులు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.
Similar News
News March 26, 2025
చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ట్వీట్

మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై దర్శకుడు అనిల్ రావిపూడి అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిందని ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారికి నా కథలో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను. ఆయనకు కథ నచ్చింది. త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకి శ్రీకారం’ అని పేర్కొన్నారు. ఉగాదికి షూటింగ్ మొదలుపెడతారని సమాచారం.
News March 26, 2025
ప్రభాస్ అలా చేస్తే ‘కన్నప్ప’ చేసేవాడిని కాదు: మంచు విష్ణు

కన్నప్ప సినిమా తీసే సమయంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించలేదని హీరో మంచు విష్ణు చెప్పారు. అయితే శివలింగాన్ని తాకే సీన్లు చిత్రీకరించే సమయంలో నేలపై పడుకున్నట్లు చెప్పారు. ఒకవేళ ఈ సినిమాను ప్రభాస్ చేస్తానని చెబితే తాను కన్నప్పను చేసేవాడిని కాదని పేర్కొన్నారు. సినిమాలో ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకత ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కన్నప్ప నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.
News March 26, 2025
అసెంబ్లీలో ప్రతిపక్షంపై సీఎం సీరియస్

TG: శాంతిభద్రతలపై ప్రతిపక్ష BRS దుష్ప్రచారం చేస్తోందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని చూస్తే కుదరదన్నారు. విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలోనే దిశ ఘటన, వామనరావు హత్య జరిగిందని తెలిపారు. <<15866506>>MMTS ఘటనపై<<>> వెంటనే స్పందించామని పేర్కొన్నారు.