News November 11, 2024

వారికి టికెట్‌లో 10% రాయితీ: TGSRTC

image

HYDలో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ కలిగిన వారికి TGSRTC ఆఫర్ ప్రకటించింది. ఆ పాస్‌తో TGతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్‌లో 10% రాయితీని ఇవ్వనున్నట్లు తెలిపింది. మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్పక్ బస్ పాస్‌లకు కూడా ఈ రాయితీ వర్తిస్తుందని, వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది.

Similar News

News April 16, 2026

BREAKING: లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు.. వాడీవేడీ చర్చ

image

లోక్‌సభలో మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ డీలిమిటేషన్ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిని చర్చకు అనుమతించడంపై కేంద్ర మంత్రులు, ప్రతి‌పక్ష ఎంపీల మధ్య వాడీవేడీగా చర్చ జరుగుతోంది. మొత్తం మూడు బిల్లులపై లోక్‌సభలో 18 గంటలు, రాజ్యసభలో 10 గంటలపాటు చర్చ, ఆపై ఓటింగ్ జరగనుంది.

News April 16, 2026

IPL: ఇదేం రూల్ సార్..

image

నిన్న LSGతో మ్యాచులో RCB బౌలర్ హేజిల్‌వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడంపై కొందరు IPL ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. అతడు తీసింది ఒకే ఒక్క వికెట్. కానీ మరో బౌలర్ రసిఖ్ దార్ 4 వికెట్లు పడగొట్టారు. అయితే హేజిల్‌వుడ్ కంటే అతడు 4 పరుగులు ఎక్కువ ఇచ్చారు. అతడి ఎకానమీ 6 కాగా హేజిల్‌వుడ్‌ది 5. దీంతో POTMకు ఇదే కొలమానమా? వికెట్లు తీయాల్సిన అవసరం లేదా? అని కొందరు BCCIని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?

News April 16, 2026

బియ్యపు పిండి దీపంతో కలిగే లాభమేంటి?

image

సర్వసాధారణంగా, అత్యంత శక్తివంతంగా వాడేది బియ్యపు పిండి దీపం. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర వచనం. లక్ష్మీదేవి ముందు ప్రతిరోజు బియ్యపు పిండి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయి. జాతకంలోని రాహు-కేతు దోషాల నివారణకు కూడా ఈ దీపం రామబాణంలా పనిచేస్తుంది. కుటుంబంలో అభివృద్ధి, సంతాన సౌఖ్యం, నిరంతర సంపద కోరుకునే వారు ఈ దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం.