News November 5, 2024
45 పైసలకే రూ.10 లక్షల బీమా
ప్రయాణికుల భద్రతకు భారతీయ రైల్వే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో IRCTC కొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో మార్పులు చేసింది. రైలు ప్రయాణం చేసేవారికి బీమా ప్రీమియం 45 పైసలుగా నిర్ణయించింది. ఇ-టికెట్లు బుక్ చేసుకునేవారికి ఇది తప్పనిసరి చేసింది. అయితే టికెట్లు బుక్ చేసుకున్నా 5 ఏళ్ల లోపు వారిని ఈ పాలసీలోకి చేర్చలేదు. టికెట్ బుక్ చేసుకున్నాక బీమా కంపెనీ సైట్‌లో నామినీ వివరాలు సమర్పించాలి.
Similar News
News December 13, 2024
అల్లు అర్జున్ అరెస్టు.. స్పందించిన రష్మిక
అల్లు అర్జున్ అరెస్టుపై ‘పుష్ప-2’ హీరోయిన్ రష్మిక స్పందించారు. ‘సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం, విచారకరం. కానీ ఈ విషయంలో అందరూ ఒకే వ్యక్తిని నిందించడం చూస్తుంటే బాధ కలుగుతోంది’ అని ట్వీట్ చేశారు. నితిన్, శ్రీ విష్ణు, సందీప్ కిషన్, అడివి శేష్, అనిల్ రావిపూడి, మెహర్ రమేశ్ తదితర సినీ ప్రముఖులు అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు.
News December 13, 2024
రాజ్యసభకు ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఉపఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో పోటీ లేకపోవడంతో రాజ్యసభకు వీరి ఎన్నిక లాంఛనమైంది. ఎన్నికైన అభ్యర్థులు శుక్రవారం ఆర్వో నుంచి ధ్రువీకరణపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్యను బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు గవ్వల భరత్ తదితరులు సన్మానించారు.
News December 13, 2024
శుభవార్త చెప్పిన ప్రభుత్వం
AP: కర్నూలు(D) పత్తికొండ మార్కెట్‌లో రూ.1కి పడిపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేయడంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. లాభ నష్టాలు లేకుండా కిలో రూ.8కి మార్కెటింగ్ శాఖ కొనాలని ఆదేశించారు. APలోని మార్కెట్లలో కూడా అదే ధరకు విక్రయించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి, తక్కువ ధరకు నాసిరకం పంట అందుబాటులోకి రావడంతో సాధారణ టమాటాపై ప్రభావం పడిందని అధికారులు, రైతులు పేర్కొన్నారు.