News August 9, 2024
ఇ-కామర్స్‌లో 10 లక్షల ఉద్యోగాలు

ఈ సారి పండగల సీజన్‌లో ఆన్‌లైన్ సేల్స్ 35 శాతం పెరిగే అవకాశం ఉందని ఇ-కామర్స్ అంచనా వేస్తోందని టీమ్ లీజ్ సర్వీసెస్ తెలిపింది. దీనికి తగ్గట్లుగా సేవలు అందించేందుకు 10 లక్షల గిగ్ కార్మికులు, 2.5 లక్షల మంది కాంట్రాక్టు సిబ్బందిని నియమించుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో 2025 కల్లా 5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగేందుకు తోడ్పాటు కానుందని అభిప్రాయపడింది.
Similar News
News April 19, 2026
పుట్టగానే శిశువుకు ఫస్ట్ బర్త్ డే!

దక్షిణ కొరియాలో అప్పుడే పుట్టిన శిశువు వయసును ఏడాదిగా పరిగణించే వింత ఆచారం ఉండేది. గర్భస్థ కాలాన్ని కూడా లెక్కించడమే దీనికి కారణం. అలాగే ప్రతి JAN 1న అందరికీ వయసు పెరుగుతుంది. అంటే.. DEC 31న పుట్టిన బిడ్డకు మరుసటి రోజే రెండేళ్లు పూర్తవుతాయి. అయితే 2023 నుంచి ఈ పద్ధతిని అక్కడి ప్రభుత్వం మార్చింది. దీంతో అందరి వయసు తగ్గడం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(51/100)
News April 19, 2026
‘శారీరక అవసరాలు ఉంటే చెప్పు’.. TCS కేసులో సంచలన విషయాలు

TCS మతమార్పిడి కేసులో ఓ బాధితురాలు ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. 2025లో కంపెనీలో చేరిన కొత్తలో వేరే విభాగానికి చెందిన రెజా, ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో ఆసిఫ్ అన్సారీ వేధించారని పేర్కొంది. ఉద్యోగ రీత్యా భర్తకు దూరంగా ఉంటున్న తనతో అసభ్యంగా మాట్లాడేవారని పేర్కొంది. ‘ఏమైనా శారీరక అవసరాలు ఉంటే చెప్పు. బుర్ఖా లేకనే మీ మతంలో ఆడవాళ్లు అత్యాచారానికి గురవుతున్నారు’ అని అన్సారీ వేధించాడని తెలిపింది.
News April 19, 2026
అల్లికలతో వ్యసనాలకు చెక్!

స్మోకింగ్, గోళ్లు కొరకడం, గంటల తరబడి మొబైల్ చూడటం వంటి వ్యసనాల నుంచి బయటపడటానికి అల్లికలు మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఖర్చుతో కూడిన థెరపీలు, కౌన్సెలింగ్‌లు అవసరం లేదంటున్నారు. ‘అల్లికలు అందంగా ఉండనక్కర్లేదు. చేతులు, కళ్ల కదలికల వల్ల పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేటై శరీరం రిలాక్స్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలూ తగ్గుతాయి’ అని పేర్కొంటున్నారు.


