News June 29, 2024
నీట్ పేపర్ లీక్ కేసులో మరో 10 మంది అరెస్ట్

నీట్ పేపర్ లీక్ కేసులో రాజస్థాన్‌కు చెందిన 10 మంది విద్యార్థులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ విద్యార్థులు వారికి బదులు డమ్మీ అభ్యర్థులతో పరీక్షలు రాయించారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో తాజాగా ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఓ స్కూల్ ప్రిన్సిపల్, సెంటర్ సూపరింటెండెంట్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
Similar News
News December 10, 2025
కేతకీ పుష్పాన్ని పూజలో ఎందుకు వినియోగించరు?

శివ పూజలో కేతకీ పుష్పం వాడరన్న విషయం తెలిసిందే! శివుని జ్యోతిస్తంభం ఆది, అంతాలను కనుగొన్నానని బ్రహ్మ అబద్ధం చెప్పడానికి ఈ పుష్పాన్నే సాక్ష్యంగా చూపాడట. అది అబద్ధపు సాక్ష్యమని గ్రహించిన శివుడు తన పూజలో ఈ పుష్పాన్ని వాడొద్దని శపించాడు. అందుకే శివపూజలో మొగలి పువ్వును వాడరు. అయినప్పటికీ శివ భక్తులు దీనిని తలలో ధరించవచ్చని, పూజా ప్రాంగణంలో అలంకారం కోసం ఉపయోగించవచ్చని పురోహితులు సూచిస్తున్నారు.
News December 10, 2025
శరీరంలో ఈ మార్పులు వస్తే జాగ్రత్త!

చాలా మంది కిడ్నీ సమస్యలను త్వరగా గుర్తించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వచ్చే కొన్ని మార్పులను గమనించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ లేదా రాత్రి వేళల్లో అతి మూత్రం, మూత్రంలో నురుగు/ఎర్రటి రంగు, ముఖం/పాదాలు లేదా శరీరం ఉబ్బినట్లు అనిపిస్తే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. బీపీ పెరుగుతున్నా కిడ్నీ సమస్యలుగా గుర్తించాలని చెబుతున్నారు.
News December 10, 2025
నాగార్జున సాగర్@70ఏళ్లు

కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జున సాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనికి శంకుస్థాపన చేసి నేటికి 70 ఏళ్లు. 1955 DEC 10న ఆనాటి PM నెహ్రూ పునాది రాయి వేశారు. 1967లో ఇందిరా గాంధీ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. 1911లోనే నిజాం ఈ ప్రాంతంలో ఆనకట్ట కట్టాలని అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. సాగర్ నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందుతోంది.


