News June 29, 2024
నీట్ పేపర్ లీక్ కేసులో మరో 10 మంది అరెస్ట్

నీట్ పేపర్ లీక్ కేసులో రాజస్థాన్‌కు చెందిన 10 మంది విద్యార్థులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ విద్యార్థులు వారికి బదులు డమ్మీ అభ్యర్థులతో పరీక్షలు రాయించారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో తాజాగా ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఓ స్కూల్ ప్రిన్సిపల్, సెంటర్ సూపరింటెండెంట్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
Similar News
News July 10, 2025
BREAKING: ఢిల్లీలో భూకంపం

దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, యూపీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదైంది. 15 సెకన్లపాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. హరియాణాలోని రోహ్‌తక్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
News July 10, 2025
ఛంగూర్ బాబా: సైకిల్ నుంచి రూ.100 కోట్ల ఆస్తి!

UPలో అనధికార మత మార్పిడులకు పాల్పడుతున్న ఛంగూర్ బాబా కేసు వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతడికి మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నట్లు, 40 బ్యాంకు ఖాతాలు, రూ.106 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాబా గతంలో సైకిల్‌పై తిరుగుతూ ఉంగరాలు, తాయిత్తులు అమ్ముకునేవాడు. అతడు బలరాంపూర్(D) రెహ్రా మాఫీలో ఓ భారీ భవనం నిర్మించుకోగా యోగి సర్కార్ బుల్డోజర్లతో కూల్చివేసింది.
News July 10, 2025
నాపై ఐరన్ లెగ్ ముద్ర వేశారు: విద్యా బాలన్

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌తో నటించాల్సిన ‘చక్రం’ సినిమా ఆగిపోవడంతో తనపై ఐరన్ లెగ్ ముద్ర వేశారని నటి విద్యా బాలన్ తెలిపారు. కానీ హీరో, డైరెక్టర్‌కు మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల వల్లే ఆ మూవీ ఆగిపోయిందన్నారు. ‘ఆ ఒక్క సినిమా ఆగిపోవడం వల్ల నేను 8-9 ప్రాజెక్టులు కోల్పోయా. రాత్రికి రాత్రే అంతా కోల్పోయా. కొన్ని సినిమాల్లో షూట్ కంప్లీట్ అయ్యాక కూడా నన్ను తొలగించారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.