News July 22, 2024
TGRTCలో రానున్న ఐదేళ్లలో 10వేల ఖాళీలు!

TG: రాష్ట్ర ఆర్టీసీలో వచ్చే ఐదేళ్లలో 10వేల ఖాళీలు ఏర్పడనున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60ఏళ్లకు పెంచడంతో 2020, 2021లో ఎవరూ రిటైర్ కాలేదు. 2022 నుంచి రిటైర్మెంట్లు ప్రారంభం కాగా గతఏడాది ఏకంగా 2325 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది 2196, 2025లో 1859, 2026లో 2001, 2027లో 1,927 మంది పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా 2029 వరకు పదివేల మందికిపైగా పదవీ విరమణ పొందనున్నట్లు సమాచారం.
Similar News
News November 28, 2025
SKLM: ఏడు రోజుల మహోత్సవానికి పకడ్బందీ ప్రణాళిక

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి మహోత్సవం ఈసారి ఏడు రోజుల పాటు (జనవరి 19 నుంచి 25 వరకు) అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. శుక్రవారం కలెక్టరేట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు సమీక్ష నిర్వహించారు. దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రతి రోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాలన్నారు.
News November 28, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*నూర్బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం
News November 28, 2025
వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.


