News July 22, 2024
TGRTCలో రానున్న ఐదేళ్లలో 10వేల ఖాళీలు!

TG: రాష్ట్ర ఆర్టీసీలో వచ్చే ఐదేళ్లలో 10వేల ఖాళీలు ఏర్పడనున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60ఏళ్లకు పెంచడంతో 2020, 2021లో ఎవరూ రిటైర్ కాలేదు. 2022 నుంచి రిటైర్మెంట్లు ప్రారంభం కాగా గతఏడాది ఏకంగా 2325 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది 2196, 2025లో 1859, 2026లో 2001, 2027లో 1,927 మంది పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా 2029 వరకు పదివేల మందికిపైగా పదవీ విరమణ పొందనున్నట్లు సమాచారం.
Similar News
News February 7, 2025
శుభ ముహూర్తం(07-02-2025)

✒ తిథి: శుక్ల దశమి రా.11.09 వరకు
✒ నక్షత్రం: రోహిణి రా.8.32 వరకు
✒ శుభ సమయాలు: ఉ.9.23 నుంచి 9.53 వరకు, సా.4.23-4.35 వరకు
✒ రాహుకాలం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి ఉ.9.12 వరకు, మ.12.24 నుంచి 1.12 వరకు
✒ వర్జ్యం: రా.1.53 నుంచి మ.3.24 వరకు
✒ అమృత ఘడియలు: సా.5.30 నుంచి 7.00 వరకు
News February 7, 2025
TODAY HEADLINES

☞ TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేయాలి.. ఎమ్మెల్యేలతో CM
☞ TG పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల
☞ తీన్మార్ మల్లన్నకు TPCC షోకాజ్ నోటీసులు
☞ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34%: AP క్యాబినెట్
☞ కరెంట్ ఛార్జీలు పెంచేది లేదు: CM చంద్రబాబు
☞ అప్పులు చేయడంలో కూటమి ప్రభుత్వం రికార్డ్: జగన్
☞ సమాజంలో కాంగ్రెస్ కుల విషం చిమ్ముతోంది: PM
☞ ENGతో తొలి వన్డేలో IND విజయం
News February 7, 2025
కులగణన మళ్లీ చేయాలి: మాజీ మంత్రి

TG: కులగణన మళ్లీ చేయాలని, రెండోసారి సర్వే చేస్తే ప్రజల్లో ఎలాంటి అయోమయం ఉండదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సర్వే లెక్కల్లో స్పష్టత లేదని, ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయని పేర్కొన్నారు. 2014 కేసీఆర్ సర్కార్ నిర్వహించిన సర్వే కంటే ఇప్పటి సర్వేలో జనాభా 62 లక్షలు తగ్గిందన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.