News November 7, 2024
20 పరుగుల తేడాతో 10 వికెట్లు
రంజీ ట్రోఫీలో భాగంగా J&Kతో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మేఘాలయ కుప్పకూలింది. 53/0 స్థితి నుంచి 73 పరుగులకే ఆలౌటైంది. 20 పరుగుల తేడాతో 10 మంది బ్యాటర్లు ఔటయ్యారు. నలుగురు డకౌట్ కాగా, మరో నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఓపెనర్లు బమంబా 21, అర్పిత్ 24 రన్స్ చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు వచ్చాయి.
Similar News
News December 11, 2024
BITCOIN: 3 రోజుల్లో రూ.5.5 లక్షల నష్టం
క్రిప్టో కరెన్సీ మార్కెట్లో బలహీనత కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే ఇందుకు కారణం. లక్ష డాలర్ల స్థాయిని తాకాక బిట్‌కాయిన్ క్రమంగా పతనమవుతోంది. 3 రోజుల్లోనే $6500 (Rs 5.5L) మేర నష్టపోయింది. ఇవాళ $96,593 వద్ద మొదలైన BTC $539 నష్టంతో $96,093 వద్ద ట్రేడవుతోంది. Mcap $1.94 ట్రిలియన్ల నుంచి $1.91 ట్రిలియన్లకు తగ్గింది. ETH, USDT, XRP, SOL, BNP, DOGE, USDC, ADA, TRX కాయిన్లూ నష్టాల్లోనే ఉన్నాయి.
News December 11, 2024
‘రైతుభరోసా’ కోసం కోకాపేట భూముల తాకట్టు?
TG: రైతు భరోసా కోసం అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరినట్లు తెలుస్తోంది. రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు ICICI బ్యాంకు అంగీకరించినట్లు సమాచారం. కోకాపేట, రాయదుర్గంలోని TGIICకి చెందిన 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఆడిటింగ్ పూర్తి చేసి RBIకి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.8 వేల కోట్లు రైతుభరోసాకు, రూ.2 వేల కోట్లు పదవీ విరమణ ఉద్యోగుల ప్రయోజనాలకు ఖర్చు చేయనుంది.
News December 11, 2024
మోహన్‌బాబుపై కేసు నమోదు
TG: మీడియా ప్రతినిధులపై <<14843588>>దాడి<<>> చేసినందుకు నటుడు మోహన్‌బాబుపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆయనపై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే నిన్న ఆయనకు నోటీసులు జారీ చేసిన రాచకొండ పోలీసులు ఇవాళ ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే నిన్న తీవ్ర ఘర్షణ తర్వాత మోహన్‌బాబు ఆసుపత్రిలో చేరారు.