News January 4, 2025

10 ఏళ్ల అమ్మాయి.. ఇన్‌స్టాగ్రామ్‌‌లో పరిచయమైన అబ్బాయితో..

image

పేరెంట్స్.. పిల్లలు మీ ఫోన్ తీసుకుని వాడుతున్నారా? అయితే ఓ కన్నేయాల్సిందే. GJకు చెందిన ఓ పదేళ్ల బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన పక్క ఊరి అబ్బాయి(16)తో లేచిపోయింది. ఐదో తరగతి చదువుతున్న అమ్మాయి డిసెంబర్ 31న తప్పిపోయిందని పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. పోలీసులు వెతికి అమ్మాయిని వాళ్లింటికి చేర్చారు. ఆ బాలిక కొన్నాళ్లుగా తల్లి ఫోన్లో Insta వాడుతోందని, స్నేహితుల సాయంతో అతడితో లేచిపోయిందని తెలిపారు.

Similar News

News November 5, 2025

పార్టీనే నాకు దైవం: కేశినేని చిన్ని

image

AP: తాను చంద్రబాబుకు వీర భక్తుడినని MP కేశినేని చిన్ని పేర్కొన్నారు. 20 నిమిషాల పాటు క్రమశిక్షణ కమిటీకి వివరణిచ్చి ఆయన వెళ్లిపోయారు. ‘పార్టీయే నాకు దైవం, చంద్రబాబు మాకు సుప్రీం. నాకు తిరువూరులో జరిగిన అవమానం కంటే MLA వల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరిగింది. నియోజకవర్గ కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుందని అనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు. ఈ తిరువూరు ఎపిసోడ్‌పై లోకేశ్ నివేదిక కోరారు.

News November 5, 2025

న్యూస్ రౌండప్

image

* US మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ కన్నుమూత
* రాష్ట్ర పరిధిలో తిరిగే ప్రైవేట్ టూరిస్ట్ బస్సు‌లకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి, చర్చలకు పిలవాలని AP ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం డిమాండ్
* దుబాయ్‌లో మంత్రి నారాయణ పర్యటన.. రాష్ట్రంలో పెట్టుబడులకు అపరెల్ గ్రూపుకు ఆహ్వానం
* జూబ్లీహిల్స్ బైపోల్: హోమ్ ఓటింగ్ వినియోగించుకున్న 97 మంది సీనియర్ సిటిజన్లు, వికలాంగులు

News November 5, 2025

ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

image

క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన వారి వివరాల పీడీఎఫ్‌ను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. 6,589 జూనియర్ అసోసియేట్స్ పోస్టులకు సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.