News January 4, 2025
10 ఏళ్ల అమ్మాయి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన అబ్బాయితో..
పేరెంట్స్.. పిల్లలు మీ ఫోన్ తీసుకుని వాడుతున్నారా? అయితే ఓ కన్నేయాల్సిందే. GJకు చెందిన ఓ పదేళ్ల బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన పక్క ఊరి అబ్బాయి(16)తో లేచిపోయింది. ఐదో తరగతి చదువుతున్న అమ్మాయి డిసెంబర్ 31న తప్పిపోయిందని పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. పోలీసులు వెతికి అమ్మాయిని వాళ్లింటికి చేర్చారు. ఆ బాలిక కొన్నాళ్లుగా తల్లి ఫోన్లో Insta వాడుతోందని, స్నేహితుల సాయంతో అతడితో లేచిపోయిందని తెలిపారు.
Similar News
News January 16, 2025
సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం: CBN
AP: గత ప్రభుత్వం అమరావతిని భ్రష్టుపట్టించిందని, పోలవరాన్ని గోదావరిలో కలిపిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘రాష్ట్రంలో స్థానికులు పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడే పరిస్థితి తెచ్చారు. మేం పెట్టుబడులు తెచ్చి, అభివృద్ధి చేసి చూపిస్తాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చు. స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్-2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని వెల్లడించారు.
News January 16, 2025
‘దబిడి దిబిడి’ స్టెప్పులపై విమర్శలు.. ఊర్వశి ఏమన్నారంటే?
‘డాకు మహారాజ్’ సినిమాలోని ‘దబిడి దిబిడి’ పాటలో డాన్స్ స్టెప్పులపై విమర్శలు రావడంపై నటి ఊర్వశీ రౌతేలా స్పందించారు. ‘లైఫ్‌లో ఏం సాధించలేని కొందరు ఇలానే ట్రోల్ చేస్తుంటారు. వాళ్లు తమకు ఆ అర్హత ఉందనుకోవడం విడ్డూరం. బాలకృష్ణ లాంటి లెజెండ్‌తో పని చేసే అవకాశం దక్కడం నాకు దక్కిన గౌరవం. ఆయనతో పని చేయాలన్న నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఆ డాన్స్ స్టెప్పులన్నీ కళలో భాగం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News January 16, 2025
శ్రీవారి భక్తులకు అలర్ట్
తిరుమల శ్రీవారి ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీపై అప్డేట్ వచ్చింది. ఈనెల 24న ఉదయం 10 గంటలకు రూ.300 టికెట్లను విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే ఏప్రిల్ నెల అకామొడేషన్ కోటా బుకింగ్స్ కూడా అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నట్లు పేర్కొన్నారు.