News December 16, 2024
పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి

AP: తన నియోజకవర్గం పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించారు. 30 బెడ్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 బెడ్ల ఆస్పత్రికి అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం రూ.38కోట్లు వెచ్చించనుంది. ఇక్కడ అవసరమైన 66 పోస్టుల్ని త్వరలోనే సర్కారు భర్తీ చేస్తుందని, వారి జీతాలకు రూ.4.32 కోట్లు వెచ్చిస్తుందని జనసేన Xలో తెలిపింది.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


