News July 29, 2024

AUG 15న 100 అన్న క్యాంటీన్లు ఓపెన్

image

AP: పట్టణాల్లో తొలి విడతలో ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ చివరికి అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం 3 భవన నిర్మాణాలే పూర్తవగా, వివిధ దశల్లో 103, టెండర్ల దశలో 77 క్యాంటీన్లు ఉన్నట్లు అధికారులు నివేదించారు. అలాగే ఆహార సరఫరాకు టెండర్ల ప్రక్రియ వచ్చే వారంలో పూర్తికానుందని పేర్కొన్నారు.

Similar News

News October 13, 2024

రేపు మద్యం దుకాణాలకు లాటరీ

image

AP: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు అందాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ఖజానాకు రూ.1,797 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు రావడంతో దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. రేపు లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తారు. ఎల్లుండి ప్రైవేట్ వ్యక్తులకు దుకాణాలు అప్పగిస్తారు. 16 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది.

News October 13, 2024

PM గతిశక్తి ఓ గేమ్ ఛేంజర్: మోదీ

image

రైల్వే నుంచి విమానాశ్ర‌యాల వ‌ర‌కు 7 కీల‌క రంగాల స‌మ్మిళిత వృద్ధి ల‌క్ష్యంగా ‘PM గ‌తిశ‌క్తి’ దేశ మౌలిక స‌దుపాయాల రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చింద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీ పెరిగి వివిధ రంగాల్లో స‌మ‌ర్థ‌వంత‌మైన పురోగ‌తికి తోడ్ప‌డిందన్నారు. ర‌వాణా వ్య‌వ‌స్థ‌ మెరుగుప‌డి ఆల‌స్యం తగ్గింద‌ని, త‌ద్వారా ఎంతో మంది కొత్త అవ‌కాశాల‌ను అందిపుచ్చుకున్నార‌ని మోదీ పేర్కొన్నారు.

News October 13, 2024

ఉద్యోగంలో చేరిన మొద‌టి రోజే రాజీనామా

image

శ్రేయ‌స్ అనేక ప్రొడ‌క్ట్ డిజైన‌ర్ వ‌ర్క్‌ఫ్రం హోం కార‌ణంగా ఓ సంస్థ‌లో త‌క్కువ జీతానికి చేరారు. మొద‌టి రోజే 9 గంట‌లు కాకుండా 12-14 గంట‌లు ప‌నిచేయాల‌ని, అది కూడా కాంపెన్సేష‌న్ లేకుండా చేయాల‌ని మేనేజర్ ఆదేశించార‌ట‌. పైగా వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఓ ఫ్యాన్సీ పదమని తీసిక‌ట్టుగా మాట్లాడ‌డంతో శ్రేయ‌స్ ఉద్యోగంలో చేరిన మొద‌టి రోజే రాజీనామా చేశారు. ఆ మెయిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌లైంది.