News November 6, 2024
హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం: టీడీపీ
AP: హైదరాబాద్‌లో మాజీ సీఎం ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన చోటే విగ్రహం ఆవిష్కరిస్తామని చెప్పారు. కాగా విగ్రహంతోపాటు కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. విగ్రహ ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను టీడీపీ నేతలు కలిసినట్లు సమాచారం.
Similar News
News November 6, 2024
పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. క్యాబినెట్ భేటీలో పవన్
AP: వైసీపీ సోషల్ మీడియా ప్రచారంపై క్యాబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై చూసీచూడనట్లుగా వదలవద్దని పవన్ చర్చను లేవనెత్తారు. ఫిర్యాదులు వస్తున్నా కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి కొంతమంది ఎస్పీలు తప్పుకుంటున్నారని మంత్రులు ఫిర్యాదు చేశారు. నెలలోగా వ్యవస్థను గాడిలో పెడదామని సీఎం మంత్రులకు చెప్పారు.
News November 6, 2024
LMV లైసెన్స్‌తో రవాణా వాహనం నడపొచ్చు: సుప్రీం
లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు రవాణా వాహనాలు నడపొచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం LMV లైసెన్స్‌తో 7500 కిలోల కంటే తక్కువ బరువున్న వాహనాలను వ్యాపారస్థులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు నడపొచ్చని స్పష్టం చేసింది. దీనిపై ఇన్సూరెన్స్ కంపెనీలు వేసిన పిటిషన్లను కొట్టివేసింది. డ్రైవర్ల జీవనోపాధికి సంబంధించిన ఈ సమస్యపై చట్టంలో సవరణలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
News November 6, 2024
ట్రంప్ గెలుపు: రష్యాకు కాదు ఉక్రెయిన్‌కే షాక్
డొనాల్డ్ ట్రంప్ విజయం ఉక్రెయిన్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాను యుద్ధాలు చేసేందుకు కాదు ఆపేందుకు వచ్చానని గెలుపు స్పీచ్‌లోనే ట్రంప్ స్పష్టం చేశారు. పైగా నాటోపై ఖర్చుచేయడం దండగని గతంలో చాలాసార్లు చెప్పారు. రష్యాతో యుద్ధం మొదలయ్యాక మిలిటరీ సాయం కింద ఉక్రెయిన్‌కు అమెరికా $64 బిలియన్లు సాయం చేసింది. ఇకపై దీనిని ఆపేయొచ్చు. మునుపటి స్థాయిలో నైతిక మద్దతు ఇవ్వకపోవచ్చు.