News November 6, 2024

హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం: టీడీపీ

image

AP: హైదరాబాద్‌లో మాజీ సీఎం ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన చోటే విగ్రహం ఆవిష్కరిస్తామని చెప్పారు. కాగా విగ్రహంతోపాటు కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. విగ్రహ ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను టీడీపీ నేతలు కలిసినట్లు సమాచారం.

Similar News

News December 5, 2024

మోస్ట్ పాపులర్ స్టార్స్.. శోభిత తర్వాతే సమంత

image

ఈ ఏడాది IMDBలో ఎక్కువగా వెతికిన స్టార్ల జాబితా విడుదలైంది. శోభిత 5వ స్థానంలో నిలిచారు. చైతూతో పెళ్లి నేపథ్యంలో ఆమె కోసం ఎక్కువగా సెర్చ్ చేయడంతో ఈ ర్యాంక్ దక్కింది. సమంత 8వ ప్లేస్‌లో ఉన్నారు. సిటాడెల్: హనీబన్నీ విడుదల, ఆమె ఇంటర్వ్యూల కోసం అభిమానులు సెర్చ్ చేశారు. టాప్-1లో త్రిప్తి దిమ్రీ, దీపిక 2, ఇషాన్ ఖట్టర్ 3, షారుఖ్ 4, శార్వరీ 6, ఐశ్వర్యరాయ్ 7, ఆలియా 9, ప్రభాస్ 10వ స్థానాల్లో నిలిచారు.

News December 5, 2024

BP, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించే పప్పు ఇది

image

పెసరపప్పుతో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువేనని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం రక్తనాళాలపై ఒత్తిడి తగ్గించి BPని నియంత్రిస్తాయి. ఫైబర్ వల్ల ఆకలి వేయదు. పరోక్షంగా బరువు తగ్గేందుకు సాయపడుతుంది. 130gr పెసలు తీసుకుంటే 5% LDL కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఓ స్టడీ పేర్కొంది. గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడుతుంది. విటమిన్స్, మినరల్స్, సూక్ష్మ పోషకాలతో ఇమ్యూనిటీ బలపడుతుంది.

News December 5, 2024

విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ దుమ్మురేపారు. మేఘాలయతో జరిగిన టీ20లో కేవలం 29 బంతుల్లోనే 106* రన్స్ చేశారు. 28 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నారు. శర్మ ఇన్నింగ్సులో 11 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. టీ20ల్లో భారత బ్యాటర్లకు ఇదే జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ. అంతకుముందు గుజరాత్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ ఈ ఏడాది NOVలో 28 బంతుల్లో సెంచరీ చేశారు.