News April 7, 2025
ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రులు: సీఎం

AP: ప్రతీ నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో గుండెజబ్బులు, డయాబెటిస్, హైపర్టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు కొన్నిచోట్ల విస్తృతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని వైద్యం, ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో CM వివరించారు.
Similar News
News January 9, 2026
OTTలోకి కొత్త సినిమాలు

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ ఈరోజు నుంచి Netflixలో 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అటు మురళీ మనోహర్ డైరెక్షన్లో నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘గుర్రం పాపిరెడ్డి’ ఈ నెల 16న ZEE5లోకి రానుంది. మరోవైపు శోభితా ధూళిపాళ్ల నటించిన ‘చీకటిలో’ సినిమా ఈ నెల 23న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతోంది. దీనికి శరత్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.
News January 9, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 9, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.22 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.15 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 9, 2026
ఈడీ vs ఐప్యాక్: హైకోర్టుకు చేరిన వివాదం!

కోల్కతాలోని ఐప్యాక్ ఆఫీసులో ED చేసిన <<18797775>>రెయిడ్స్<<>>పై రోజంతా హైడ్రామా నడిచింది. మమత వర్సెస్ ఈడీ అన్నట్లు సాగిన ఈ వ్యవహారం చివరికి కలకత్తా హైకోర్టుకు చేరింది. ఈడీ, ఐప్యాక్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. బెంగాల్ కోల్ మైనింగ్ స్కామ్కు సంబంధించి తాము సోదాలు చేశామని, తమను మమత అడ్డుకున్నారని ఈడీ తమ పిటిషన్లో పేర్కొంది. ఈడీ రెయిడ్స్ను ఆపేలా ఆదేశించాలని ఐప్యాక్ అభ్యర్థించింది.


