News April 7, 2025

ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రులు: సీఎం

image

AP: ప్రతీ నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో గుండెజబ్బులు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు కొన్నిచోట్ల విస్తృతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని వైద్యం, ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో CM వివరించారు.

Similar News

News April 23, 2025

అదానీ స్పెక్ట్రమ్‌తో ఎయిర్‌టెల్ డీల్

image

అదానీ డేటా నెట్‌వర్క్స్‌ 26GHz బ్యాండ్‌లోని 400 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను వాడుకునేందుకు ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.212 కోట్లు చెల్లించింది. గుజరాత్, ముంబై, ఏపీ, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులోని స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్ వినియోగించుకుంటుంది. దీనివల్ల 5G వేగం, నెట్‌వర్క్ కెపాసిటీ పెరగనుంది. యూజర్లకు నాణ్యమైన సేవలు అందుతాయి.

News April 23, 2025

ఉగ్రదాడి వెనుక TRF.. దీని చరిత్ర ఇదే

image

J&K పహల్గామ్‌లో జరిగిన పాశవిక <<16183726>>ఉగ్రదాడి<<>> వెనుక ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF)’ ఉన్నట్లు సమాచారం. ఇది పాక్‌కు చెందిన లష్కర్ ఏ తొయిబాకు అనుబంధ సంస్థ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 AUGలో ఏర్పాటైంది. దీనికి షేక్ సాజిద్ కమాండర్, బాసిత్ అహ్మద్ ఆపరేషనల్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. దీన్ని కేంద్రం 2023లో ఉగ్రసంస్థగా ప్రకటించింది. కాగా నిన్న జరిగిన దాడిలో దాదాపు 30 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే.

News April 23, 2025

ఏప్రిల్ 23: చరిత్రలో ఈరోజు

image

✒ 1616: ప్రఖ్యాత నాటక రచయిత షేక్‌స్పియర్ మరణం
✒ 1791: అమెరికా మాజీ అధ్యక్షుడు బుకానన్ జననం
✒ 1891: రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి జననం
✒ 1938: ప్రముఖ సింగర్ ఎస్.జానకి జననం
✒ 1969: నటుడు మనోజ్ బాజ్‌పాయ్ జననం
✒ 1992: సినీ దర్శకుడు సత్యజిత్ రే మరణం
✒ 2020: ప్రముఖ రంగస్థల నటి ఉషా గంగూలీ మరణం
✒ ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం
✒ నేడు ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం

error: Content is protected !!