News December 5, 2024

$100000: ‘వైల్డ్ ఫైర్’ మూడ్‌లో బిట్‌కాయిన్

image

క్రిప్టో కరెన్సీ రారాజు బిట్‌కాయిన్ ‘వైల్డ్ ఫైర్’ మూడ్‌లో ఉంది. చరిత్రలో తొలిసారి లక్ష డాలర్ల మార్కును అందుకుంది. క్రితం రోజుతో పోలిస్తే 7.89% పెరిగి భారత కరెన్సీ ప్రకారం రూ.88.50లక్షల వద్ద ట్రేడవుతోంది. ఇక మార్కెట్ డామినెన్స్ 55.07%గా ఉంది. మూమెంటమ్ ఇలాగే కొనసాగితే $1.10 లక్షలకు చేరుకోవడం ఖాయమేనని విశ్లేషకులు అంటున్నారు. NOV 22న $99,800కు టచ్ చేసిన BTCకి లక్ష డాలర్ల వద్ద రెసిస్టెన్సీ ఎదురైంది.

Similar News

News April 15, 2026

హార్దిక్ నిర్ణయాలపై రోహిత్ సంతృప్తిగా లేరు: మాజీ క్రికెటర్

image

హార్దిక్ చెత్త నిర్ణయాల వల్లే RCB చేతిలో ముంబై ఓడిపోయిందని మాజీ క్రికెటర్ సడగొప్పన్ రమేశ్ అభిప్రాయపడ్డారు. ‘MIకి హార్దిక్ కెప్టెన్సీనే పెద్ద సమస్య. 7, 8వ ఓవర్లు వరుసగా స్పిన్నర్లకు ఇచ్చాడు. పాటీదార్ ఉన్నప్పుడు ఇలా చేయడం పెద్ద తప్పు. డేవిడ్‌కు హై ఫుల్ టాస్ వేసి DRSకు వెళ్లడంతో సూర్య షాకయ్యాడు. అటు రోహిత్ కూడా హార్దిక్ నిర్ణయాలపై సంతృప్తిగా లేనట్లు క్లియర్‌గా కనిపించింది’ అని తెలిపారు.

News April 15, 2026

విమానంలో మహిళపై రేప్.. భారతీయ ప్రయాణికుడిపై ఆరోపణలు

image

సింగపూర్ నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణిస్తున్న విమానంలో పక్కనే కూర్చున్న మహిళపై సుధీర్ కుమార్ (52) అనే భారతీయుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన స్కూట్ ఎయిర్ లైన్స్ సిబ్బంది బాధితురాలిని మరో సీటుకు మార్చినట్లు పేర్కొన్నారు. ఫ్లైట్ ల్యాండ్ అవగానే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా అక్కడి చట్టాల ప్రకారం గరిష్ఠంగా 12ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

News April 14, 2026

ఆస్ట్రేలియాలో ఐపీఎల్.. ఇండియాలో BBL?

image

IPL-2027లో ఒక మ్యాచును AUSలోని అడిలైడ్ ఓవల్ స్టేడియం హోస్ట్ చేసే అవకాశముంది. అక్కడ భారతీయులు ఎక్కువగా ఉండటంతో మ్యాచుకు క్రేజ్ ఎక్కువగా ఉంటుందని స్టేడియం మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే AUSలో జరిగే ‘బిగ్‌బాష్ లీగ్’ మ్యాచునూ INDలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికోసం చెన్నై స్టేడియాన్ని పరిశీలిస్తున్నట్లు టాక్. త్వరలోనే BCCIతో దీనిపై చర్చలు జరిగే ఛాన్సుంది.