News November 27, 2024

ఒక్క ఛార్జ్‌తో 102KM: యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది

image

హోండా కంపెనీ భారత మార్కెట్లో Activa e ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 102KM వెళ్లడం దీని ప్రత్యేకత. స్టైలింగ్ విషయంలో కంపెనీ మినిమలిస్టిక్ అప్రోచ్ పాటించింది. ICE స్కూటర్‌ మోడల్‌నే అనుసరించింది. రెండు 1.5kWh బ్యాటరీలుండే ఈ స్కూటర్లో LED హెడ్‌లైట్‌కే ఇండికేటర్లు ఉంటాయి. ఫ్లోర్‌బోర్డ్ చిన్నగా సీటు పెద్దగా ఉంటాయి. ఇందులో స్టాండర్డ్, స్పోర్ట్, ఈకాన్ వేరియెంట్లు ఉన్నాయి.

Similar News

News December 4, 2024

అమరులైన పోలీస్ కుటుంబాలకు రూ.లక్ష: హోంమంత్రి

image

AP: విధినిర్వహణలో ప్రమాదవశాత్తు/ఆకస్మికంగా/అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు అందించే తక్షణ సాయాన్ని కూటమి ప్రభుత్వం మూడు రెట్లు పెంచింది. వారి అంతిమ సంస్కారాల కోసం అందించే రూ.25వేల సాయాన్ని రూ.లక్షకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని హోంమంత్రి అనిత X వేదికగా వెల్లడించారు.

News December 4, 2024

ఉద్యోగాల్లో రోబోటిక్స్ వినియోగం ఎక్కువగా ఉన్న దేశం ఇదే!

image

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో రోబోల వినియోగం భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ కొరియాలో ఇవి అత్యధిక సంఖ్యలో వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఇక్కడ ప్రతి 10వేల మంది ఉద్యోగులకు 1,102 రోబోలు ఉన్నాయి. 2008 నుంచి పోల్చితే వీటి వినియోగం 5శాతం పెరిగింది. ఈ దేశం రోబోటిక్స్ వైపు మళ్లడంతో పనుల్లో మానవ శ్రమ తగ్గి ఉత్పాదకత పెరిగింది.

News December 4, 2024

‘సీజ్ ద షిప్’ పేరిట మూవీ టైటిల్

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన మాట ఇప్పుడు ఓ సినిమాకు టైటిల్‌గా మారింది. ఇటీవల కాకినాడ పోర్టులో తనిఖీల సందర్భంగా ఆయన ‘సీజ్ ద షిప్’ అనే ఆదేశాలు ఇవ్వడంతో అప్పటినుంచి ఈ వాక్యం వైరలవుతోంది. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఓ సినీ నిర్మాత రూ.1100 చెల్లించి ‘సీజ్ ద షిప్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నారు.