News May 3, 2024

ఈ నెల 20 తర్వాత 10, 12th క్లాస్ ఫలితాలు: CBSE

image

ఈ ఏడాది 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల 20 తర్వాత వెల్లడిస్తామని CBSE వెల్లడించింది. రిజల్ట్స్‌పై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరింది. కాగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు టెన్త్, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.

Similar News

News December 26, 2024

అంబటి రాంబాబు సంచలన ట్వీట్

image

AP: వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు. ‘దీక్షలో ఉన్న ధీరుడిని టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 36 సంవత్సరాలు. జోహార్ వంగవీటి మోహన రంగా’ అని Xలో పేర్కొన్నారు. కాగా 1988లో బెజవాడలో జరిగిన అల్లర్లలో మోహన రంగాను ప్రత్యర్థులు హతమార్చారు.

News December 26, 2024

మంత్రులు, అధికారులతో సీఎం సమావేశం

image

సినీ ప్రముఖులతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమావేశం అయ్యారు. సినీ పరిశ్రమ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం పోలీస్ కమాండ్ సెంటర్ (CCC)లో నిర్మాతలు, దర్శకులు, నటులతో సీఎం భేటీ కానున్నారు.

News December 26, 2024

బాక్సింగ్ డే: ముగ్గురు బ్యాటర్లు అర్ధసెంచరీలు

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఓపెనర్లు కోన్ట్సస్(60), ఖవాజా(57) అర్ధసెంచరీలతో రాణించారు. టీ విరామం తర్వాత లబుషేన్(61*) కూడా అర్ధసెంచరీ పూర్తి చేశారు. మరో బ్యాటర్ స్మిత్(30*) క్రీజులో ఉన్నారు. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు.