News May 3, 2024

ఈ నెల 20 తర్వాత 10, 12th క్లాస్ ఫలితాలు: CBSE

image

ఈ ఏడాది 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల 20 తర్వాత వెల్లడిస్తామని CBSE వెల్లడించింది. రిజల్ట్స్‌పై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరింది. కాగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు టెన్త్, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.

Similar News

News December 11, 2025

నేడు కాంగ్రెస్ పెద్దలతో సీఎం భేటీ

image

TG: సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. 11AMకు పార్లమెంట్‌కు వెళ్లి రాహుల్, KC వేణుగోపాల్, ప్రియాంకా గాంధీని కలవనున్నారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమ్మిట్ వివరాలను వారితో పంచుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనా చర్చించే అవకాశముంది. బుధవారం రాత్రికే ఢిల్లీ చేరుకున్న ఆయన NCP అధినేత శరద్ పవార్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.

News December 11, 2025

పెరిగిన చలి.. కోళ్ల సంరక్షణలో జాగ్రత్తలు(2/2)

image

కోళ్లకు తాజా నీరు, దాణా మాత్రమే అందించాలి. కోళ్ల దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. దాణా బస్తాలను గోడలకు తగలకుండా చూడాలి. తేమ ఉన్న దాణా నిల్వ చేయకూడదు. బాగా ఎండిన దాణాను మాత్రమే నిల్వ ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనల మేరకే తగిన మోతాదులో ఆక్సిటెట్రాసైక్లిన్‌, సల్ఫాడిమిడిన్ వంటి యాంటీ బయాటిక్స్‌, ఇతర శానిటైజర్లు, విటమిన్‌లు, దాణా నీరు ఇవ్వాలి. కోళ్లకు అవసరమైన టీకాలు వేయించాలి.

News December 11, 2025

మరింత పెరగనున్న రీఛార్జ్ ధరలు!

image

మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు త్వరలో పెరగనున్నట్లు తెలుస్తోంది. Jio, Airtel, VI టారిఫ్‌లను 10 నుంచి 12% వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని టెలికం వర్గాలు చెబుతున్నాయి. తక్కువ ధరలలో ఉన్న కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను ఇప్పటికే కంపెనీలు తొలగించడం కూడా పెంపుపై అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు పేమెంట్ యాప్‌లలోనూ “రీఛార్జ్ ధరలు పెరగొచ్చు” అంటూ అలర్ట్స్ రావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.