News March 18, 2024

పదో తరగతి పరీక్షలు.. సందేహాలు ఉంటే ఫోన్ చేయండి !

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి, విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలున్నా.. చరవాణి నం. 7702775340కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలని, 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

Similar News

News March 14, 2026

MBNR: ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొడతా లేదని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సిలిండర్ల విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందకూడదన్నారు. సంక్షేమ హాస్టల్లో హాస్పిటళ్లు విద్యాసంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదని వెల్లడించారు.

News March 14, 2026

నేడు గద్వాలకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి శనివారం జోగులాంబ గద్వాల జిల్లాకు రానున్నారు. గద్వాల పట్టణంలో జరగనున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తనయుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్య వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12గంటలకు సీఎం గద్వాలకు చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారని పేర్కొన్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

News March 14, 2026

MBNR: టెన్త్ పరీక్షలు.. ఎస్పీ కీలక ఆదేశాలు

image

టెన్త్ పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల పరిసరాలలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. పరీక్ష ప్రాంతాలలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డిజేలు ఉపయోగించి ఉరేగింపులు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. సెక్షన్-163 అమలు చేస్తున్నట్లు తెలిపారు.