News March 22, 2024

గంజాయి మత్తులో టెన్త్ క్లాస్ అమ్మాయిలు

image

TG: జగిత్యాలలో టెన్త్ విద్యార్థినులు గంజాయికి బానిసలయ్యారు. ఓ అమ్మాయి కొన్ని రోజులుగా వింతగా ప్రవర్తించడంతో తండ్రికి అనుమానం వచ్చింది. ఆమె గంజాయికి అలవాటు పడిందని తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా శిశు సంరక్షణ కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఆ అమ్మాయితో పాటు మరో 10 మంది గంజాయికి బానిసలైనట్లు తేలింది. ఓ సెక్స్ రాకెట్ వారికి గంజాయి ఇచ్చి, HYDలో రేవ్ పార్టీలకూ తరలిస్తున్నట్లు వెల్లడైంది.

Similar News

News September 13, 2024

నేడు పిఠాపురానికి వైఎస్ జగన్

image

AP: వరద బాధితులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురం రానున్నారు. నియోజకవర్గంలోని మాధవపురం, రమణక్కపేటలో ప్రజలు, రైతులతో సమావేశమవుతారు. అలాగే ఏలేరు వరద ఉద్ధృతితో అతలాకుతలమై నీటమునిగిన పొలాలను ఆయన పరిశీలిస్తారు. అనంతరం ఆయన తాడేపల్లికి చేరుకుంటారు.

News September 13, 2024

మూత్రం, మురుగు నీటి నుంచి బీర్‌ తయారీ!

image

సింగపూర్‌లో న్యూబ్రూ అనే కంపెనీ బీర్‌ను తయారుచేస్తుంటుంది. ఆ బీర్ రుచి ఇతర కంపెనీల మాదిరిగానే ఉన్నా వాస్తవంగా మూత్రం, మురుగునీటి నుంచి శుద్ధి చేసిన నీటి నుంచి దాన్ని తయారు చేస్తున్నారు. సింగపూర్‌ ప్రభుత్వం దేశ డ్రైనేజీల్ని రీసైకిల్ చేసి ‘నెవాటర్‌’ అనే తాగునీటిని ఉత్పత్తి చేస్తోంది. ఆ నీటినే న్యూబ్రూ వాడుతోంది. తయారీలో అంతర్జాతీయ ప్రమాణాల్ని అనుసరిస్తున్నామని సంస్థ వినియోగదారులకు హామీ ఇస్తోంది.

News September 13, 2024

పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్.. గరిష్ఠంగా రూ.10 వేలే సబ్సిడీ: కేంద్రమంత్రి

image

విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడం కోసం కేంద్రం PM ఈ-డ్రైవ్ స్కీమ్‌ను తెచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించింది. కాగా స్కీమ్ కింద తొలి ఏడాది గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ చెల్లించనున్నట్లు కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. రెండో ఏడాది గరిష్ఠంగా రూ.5వేలు చెల్లిస్తామన్నారు. ఇ-రిక్షాలకు రూ.25 వేలు, రెండో ఏడాది రూ.12,500 అందిస్తామన్నారు.