News April 7, 2024
ఈనెల 25న పదో తరగతి ఫలితాలు?
AP: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈనెల 25న ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. దీనిపై విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మూల్యాంకన ప్రక్రియ సోమవారంతో ముగియనుందని అధికారులు చెబుతున్నారు. నేడు మధ్యాహ్నం వరకు 95% పూర్తవుతుందన్నారు. ఈసీ అనుమతి తీసుకున్నాకే ఫలితాలను వెల్లడిస్తారని, ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఈనెల 30లోపు ఫలితాల ప్రకటన ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News January 14, 2025
తుది దశకు హమాస్-ఇజ్రాయెల్ వార్!
హమాస్-ఇజ్రాయెల్ మధ్య 15 నెలలుగా సాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. గాజాలో శాంతి స్థాపన కోసం కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు. బందీల విడుదలకు హమాస్ ఓకే చెప్పిందని మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతర్ పేర్కొంది. 2023 OCT 7న హమాస్ మిలిటెంట్ల దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 47వేల మంది మరణించారు.
News January 14, 2025
నిద్రలో కింద పడిపోతున్నట్లు అనిపిస్తోందా?
చాలామంది నిద్రలోకి జారుకోగానే కిందపడిపోతున్నామనే ఫీలింగ్ వచ్చి జెర్క్ ఇస్తారు. దీన్నే హిప్నిక్ జెర్క్ లేదా స్లీప్ స్టార్ట్ అని అంటారు. నిద్రపోతుండగా శరీర కండరాల్లో కదలికల వల్లే ఈ ఆకస్మిక కుదుపులు సంభవించొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక ఒత్తిడి, ఆందోళన, అలసట కూడా కారణాలేనట. అయితే నిద్ర డిస్టర్బ్ కావడం, తరచూ దీనికి గురైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News January 14, 2025
ఐకానిక్ చిత్రం స్థానంలో ‘కర్మ క్షేత్ర’.. సమర్థించుకున్న ఆర్మీ చీఫ్
1971 వార్‌లో పాక్ ఆర్మీ లొంగుబాటు సందర్భంగా తీసిన పిక్చర్ వెరీ ఫేమస్. న్యూఢిల్లీ రైసీనా హిల్ ఆఫీస్‌లో ఉన్న ఆ ఫొటో స్థానంలో ‘కర్మ క్షేత్ర’ పెయింటింగ్‌ను ఉంచడాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర సమర్థించుకున్నారు. ‘ఆర్మీలో జనరేషన్ల మార్పును సూచిస్తూ కల్నల్ థామస్ దీన్ని రూపొందించారు’ అని తెలిపారు. ‘దేశ విలువలు, ధర్మాన్ని రక్షించే పాత్రలో సైన్యం, టెక్నాలజీని ఇది ప్రతిబింబిస్తుంది’ అని ఆర్మీ పేర్కొంది.