News May 24, 2024

జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

image

TG: వచ్చే నెల 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వీటిని నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాల్లో 12,186మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

Similar News

News January 9, 2026

వీళ్లెవరండీ బాబూ.. స్పీడ్ బ్రేకర్లను ఎత్తుకెళ్లారు

image

MPలోని విదిశ(D)లో ఓ వింతైన దొంగతనం జరిగింది. ఇటీవల రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను దొంగలు రాత్రికి రాత్రే మాయం చేశారు. మెయిన్ రోడ్డు, దుర్గా నగర్ చౌక్, డిస్ట్రిక్ట్ కోర్టు, వివేకానంద చౌక్ మధ్య ప్రాంతాల నుంచి వీటిని ఎత్తుకెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే ఈ చోరీ జరగడంతో విమర్శలు వస్తున్నాయి. స్పీడ్ బ్రేకర్లే సురక్షితంగా లేకపోతే తమ భద్రత ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

News January 9, 2026

కాశీ సెట్‌లో హైఓల్టేజ్ యాక్షన్‌

image

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ సినిమా ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాగా కాశీ నగరాన్ని తలపించే భారీ సెట్‌లో యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్‌బాబు, ప్రకాశ్‌రాజ్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లను పూర్తి చేసిన మేకర్స్, ప్రస్తుతం హైఓల్టేజ్ యాక్షన్‌పై ఫోకస్ పెట్టారు.

News January 9, 2026

హజ్ యాత్రకు వీరు అనర్హులు: సౌదీ ప్రభుత్వం

image

హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 వర్గాల వారికి అనుమతి లేదని స్పష్టం చేసింది. డయాలసిస్ రోగులు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయ వ్యాధులతో బాధపడేవారు, కీమోథెరపీ చేయించుకున్న క్యాన్సర్ రోగులు, వైకల్యంతో ఉన్నవారు, అలాగే 28 వారాలు నిండిన గర్భిణీలను అనర్హులుగా ప్రకటించింది. మరోవైపు ప్రైవేట్ గ్రూపుల ద్వారా వెళ్లేవారు ఈ నెల 15లోపు బుకింగ్‌లు పూర్తి చేయాలని హజ్ సంఘాలు సూచించాయి.