News May 24, 2024
జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

TG: వచ్చే నెల 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వీటిని నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాల్లో 12,186మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
Similar News
News February 13, 2025
జూన్‌లో ‘స్థానిక’ ఎన్నికలు?

TG: బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. MARలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లును కేంద్రానికి పంపాలని చూస్తోంది. అటు MAR, APRలో ఇంటర్, పది పరీక్షలుండటంతో ప్రభుత్వ టీచర్లంతా అందులోనే నిమగ్నం కానున్నారు. ఆపై APR, MAYలో ఎండల తీవ్రత వల్ల ఎన్నికలు నిర్వహించకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్, జులైలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందంటున్నారు.
News February 13, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్‌గా శిఖర్ ధవన్

భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ ఛాంపియన్స్ ట్రోఫీకి అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అతనితో పాటు PAK క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్, AUS మాజీ ఆల్‌రౌండర్ వాట్సన్, NZ మాజీ పేసర్ సౌథీని ICC అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. 2013లో భారత్ CT గెలవడంలో గబ్బర్ కీలకంగా వ్యవహరించారు. అలాగే, టోర్నీ చరిత్రలో వరుసగా 2సార్లు ‘గోల్డెన్ బ్యాట్’ అవార్డ్ అందుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచినందుకు శిఖర్‌కు ఈ గౌరవం దక్కింది.
News February 13, 2025
దేశంలోనే కర్నూలులో హై టెంపరేచర్

AP: రాష్ట్రంలో మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కర్నూలులో బుధవారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 37.8°C నమోదైంది. రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. మరోవైపు, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.