News November 24, 2024

ఫిల్ సాల్ట్‌కు రూ.11.50 కోట్లు

image

విధ్వంసకర ఓపెనర్, వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్‌‌ను రూ.11.50 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఇతను గత సీజన్లో KKR తరఫున ఆడారు. ఇతని కోసం ఆర్సీబీ, KKR పోటీ పడ్డాయి. ఐపీఎల్ కెరీర్‌లో ఫిల్ సాల్ట్‌‌ 21 మ్యాచ్‌లు ఆడి 653 రన్స్ చేశారు. 175.54 స్ట్రైక్ రేట్ ఉంది.

Similar News

News December 2, 2024

శుభ ముహూర్తం

image

తేది: డిసెంబర్ 02, సోమవారం
మార్గశీర్ష శు.పాడ్యమి: మ.12.43 గంటలకు
జ్యేష్ఠ: మ.03.43 గంటలకు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: తె.12.19-1.04 గంటల వరకు,
మ.2.33-3.18 గంటల వరకు

News December 2, 2024

సీఎస్కేకి ఆడాలనుకోవడానికి కారణమదే: చాహర్

image

పేసర్ దీపక్ చాహర్‌ను వేలంలో ముంబై కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను తొలి నుంచీ CSKకి ఆడాలనుకున్నానని చాహర్ తెలిపారు. ‘ఫస్ట్ నుంచీ ధోనీ నాకు అండగా నిలిచారు. అందుకే CSK అంటే అంత ఇష్టం. పర్స్ తక్కువ ఉండటంతో ఈసారి ఆ టీమ్‌కి వెళ్లనని ముందే అర్థమైంది. రూ.13 కోట్ల పర్స్ ఉంటే రూ.9 కోట్ల వరకూ నాకోసం ట్రై చేశారు. ఏదేమైనా.. ఇప్పుడు మరో గొప్ప ఫ్రాంచైజీకి ఆడనున్నానని సంతోషంగా ఉంది’ అని వివరించారు.

News December 2, 2024

TODAY HEADLINES

image

* రూ.2లక్షల లోపు రుణమాఫీ పూర్తి: CM రేవంత్
* AP: తుఫాన్ ఎఫెక్ట్.. చిత్తూరు, అన్నవరం జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటన
*TG: సంక్రాంతి తర్వాత రైతుభరోసా: CM రేవంత్
* AP: ప్రజల నుంచి నిరంతరం ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి: CM చంద్రబాబు
* TG: ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
* పెరిగిన కమర్షియల్ సిలిండర్, కోడిగుడ్ల ధరలు