News July 9, 2024

PMAY డబ్బు తీసుకొని.. లవర్స్‌తో వెళ్లిపోయిన 11మంది మహిళలు!

image

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మొదటి విడతగా రూ.40వేలు అందుకున్న 11మంది వివాహితలు భర్తలను వదిలేసి తమ లవర్స్‌తో వెళ్లిపోయారట.
UPలోని మహారాజ్‌గంజ్‌ జిల్లాలో జరిగిందీ ఘటన. సదరు భర్తలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చిందట. దీంతో 2వ విడత డబ్బును అధికారులు నిలిపివేసినట్లు సమాచారం. గతేడాదీ ఇలాగే రూ.50వేలు తీసుకొని నలుగురు మహిళలు లవర్స్‌తో పరారయ్యారు.

Similar News

News December 30, 2025

జనవరి నుంచే అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్!

image

TG: కొత్త ఏడాదిలో జనవరి మొదటివారం నుంచే అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది. HYDలో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్‌ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. టీజీ ఫుడ్స్ ద్వారా రెడీ టు ఈట్ పద్ధతిలో ఆహారాన్ని అందించనున్నారు. ఒక రోజు కిచిడీ, మరొక రోజు ఉప్మా ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 35,781 అంగన్‌వాడీ సెంటర్లలో 8 లక్షల మంది చిన్నారులు ఉన్నారు.

News December 30, 2025

బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, BNP చీఫ్ ఖలీదా జియా (80) మరణించారు. గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. ఇటీవలే ఆమె కుమారుడు తారిఖ్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. జియా పదేళ్ల పాటు (1991-96, 2001-06) బంగ్లా ప్రధానిగా పని చేశారు.

News December 30, 2025

DANGER: అరటి తోటల్లో ఈ మందు పిచికారీ చేస్తున్నారా?

image

అరటి తోటల్లో కలుపు ప్రధాన సమస్య. దీని కట్టడికి వ్యవసాయ నిపుణులు గ్లూఫోసినేట్ అమ్మోనియం, పారాక్వాట్ సహా పలు కలుపు మందులను సిఫార్సు చేస్తున్నారు. అయితే కొందరు రైతులు అవగాహన లేక 2,4-D రసాయనాన్ని కలుపు మందుగా అరటిలో వాడుతున్నారు. దీని వల్ల పంటకు తీవ్ర నష్టం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ మందుతో పంటకు కలిగే నష్టమేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.