News July 9, 2024
PMAY డబ్బు తీసుకొని.. లవర్స్‌తో వెళ్లిపోయిన 11మంది మహిళలు!
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మొదటి విడతగా రూ.40వేలు అందుకున్న 11మంది వివాహితలు భర్తలను వదిలేసి తమ లవర్స్‌తో వెళ్లిపోయారట.
UPలోని మహారాజ్‌గంజ్ జిల్లాలో జరిగిందీ ఘటన. సదరు భర్తలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చిందట. దీంతో 2వ విడత డబ్బును అధికారులు నిలిపివేసినట్లు సమాచారం. గతేడాదీ ఇలాగే రూ.50వేలు తీసుకొని నలుగురు మహిళలు లవర్స్‌తో పరారయ్యారు.
Similar News
News October 8, 2024
పోలవరం సందర్శకుల ఖర్చులకు రూ.23 కోట్లు విడుదల
AP: గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజలను పోలవరం ప్రాజెక్టుకు సందర్శనకు ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి ఉచితంగా భోజనాలు పెట్టేవారు. దీనికి సంబంధించి 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు ఖర్చు చేసిన నిధులను కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు. వారు హైకోర్టును ఆశ్రయించగా 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీంతో మొత్తం రూ.23.11 కోట్ల నిధుల విడుదలకు జలవనరుల శాఖ తాజాగా ఆమోదం తెలిపింది.
News October 8, 2024
పోలవరానికి రూ.2,800 కోట్లు విడుదల
AP: పోలవరం ప్రాజెక్టుకు రూ.2,800 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. రీయింబర్స్‌మెంట్ కింద రూ.800 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,000 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే, వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.6,157 కోట్ల మంజూరుకు కేంద్రం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
News October 8, 2024
YELLOW ALERT: రెండు రోజులు వర్షాలు
TGలో 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, వరంగల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో నేడు APలోని మన్యం, అల్లూరి, ఉ.గో, రాయలసీమ, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని APSDMA పేర్కొంది.