News April 21, 2024

ఏడాదిలో రూ.1,161 కోట్లు.. 1,031 కేజీల బంగారం

image

AP: వడ్డీ కాసుల వాడి ఖజానా ఏటేటా పెరుగుతోంది. 2023-24లో భక్తులు సమర్పించుకున్న రూ.1,161 కోట్ల నగదు, 1,031 కేజీల బంగారాన్ని టీటీడీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. దీంతో శ్రీవారి నగదు డిపాజిట్లు రూ.18వేల కోట్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వ 11,329 కేజీలకు చేరింది. ఈ మొత్తానికి ఏటా రూ.1,200 కోట్ల వడ్డీ వస్తోంది. అలాగే శ్రీవాణి ట్రస్టుకు నాలుగేళ్లలో రూ.1,200 కోట్ల విరాళాలు వచ్చాయి.

Similar News

News April 11, 2026

రూ.158 కోట్ల అప్పు.. అమెరికాను వీడిన హంటర్!

image

US మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ దేశాన్ని వీడినట్లు సమాచారం. ఆయన ఏ దేశంలో ఉన్నది తనకూ తెలియదని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. తనకు కూడా $50Kను చెల్లించలేదని తెలిపారు. హంటర్‌కు USలో $17 మిలియన్ల(దాదాపు రూ.158 కోట్లు) అప్పులున్నాయి. కాగా అక్రమ ఆయుధాల కేసులోనూ ఆయన 2024లో దోషిగా తేలారు. అయితే అధ్యక్షునిగా పదవీ కాలం ముగిసే సమయంలో బైడెన్ తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించారు.

News April 11, 2026

ఛార్జీలు విధిస్తే UPI వాడకం ఆపేస్తామంటున్న యూజర్లు!

image

లాంచ్ అయిన పదేళ్లలో UPI డిమాండ్ గణనీయంగా పెరిగినా ఛార్జీలు విధించే ప్రతిపాదనను యూజర్లు ఇష్టపడనట్లు ఓ రిపోర్ట్ పేర్కొంది. అదే జరిగితే వాడకం ఆపేస్తామని 75% మంది యూజర్లు తేల్చిచెప్పినట్లు తెలిపింది. మిగతా 25% మంది అనుకూలంగా ఉన్నా ఛార్జీల విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కొందరు ఫిక్స్‌డ్ ఫీజుకు ఓటేయగా, ట్రాన్సాక్షన్ వాల్యూ బట్టి ఛార్జీలు ఉండాలని మరికొందరు చెప్పినట్లు పేర్కొంది.