News April 2, 2025
1,161 ఉద్యోగాలు.. రేపే లాస్ట్

CISF భర్తీ చేయనున్న 1,161 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ గడువు APR 3తో ముగియనుంది. కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టులకు మెట్రిక్యులేషన్ కలిగిన 18 – 23 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. అన్‌రిజర్వ్‌డ్, OBC, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100 కాగా మహిళలు, SC, STలకు ఉచితం. వయసు 18-23ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.21,700-రూ.69,100 వరకు ఇస్తారు.
వెబ్‌సైట్: <
Similar News
News April 20, 2025
భారీగా పడిపోయిన ‘దొండ’ రేటు!

<<16113156>>ఉల్లి,<<>> టమాటా తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లో దొండకాయల ధర భారీగా పడిపోయింది. ఇటీవల 10 కిలోల దొండ ధర రూ.300-325 పలకగా ప్రస్తుతం రూ.150-50కి పడిపోయింది. ఎకరా విస్తీర్ణంలో సాగుకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. కొన్నిచోట్ల వ్యాపారులు కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తుండటంతో పెట్టుబడి ఖర్చులూ రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. అయితే బహిరంగ మార్కెట్‌లలో కిలో రేటు రూ.20-30 వరకు ఉండటం గమనార్హం.
News April 20, 2025
కాబోయే భర్తకు ఉండాల్సిన 18 లక్షణాలు.. యువతి పోస్ట్ వైరల్

తనకు కాబోయే భర్తకు 18 లక్షణాలు ఉండాలంటూ డేటింగ్ యాప్‌లో ఓ యువతి పోస్ట్ చేసింది. ‘నాపై డీప్ లవ్, రూ.2.5 కోట్ల జీతం, లగ్జరీ లైఫ్, ఉదార స్వభావం, తెలివైన, ధైర్యం, విలువలు, ఫిట్‌నెస్, క్రమశిక్షణ, సామాజిక గౌరవం, ఫ్యామిలీ పర్సన్, నా లైఫ్‌స్టైల్‌కు సపోర్ట్, ట్రావెలింగ్, ప్రైవసీకి ప్రాధాన్యం, లైంగిక క్రమశిక్షణ, గర్భనిరోధక చర్యలు, ఈజీ లైఫ్ లీడ్ చేయించే వాడు’ తనకు భర్తగా కావాలని రాసుకొచ్చింది. మీ COMMENT?
News April 20, 2025
మరణంపై విజయం.. ఈస్టర్ శుభాకాంక్షలు

శిలువపై ప్రాణాలు విడిచిన ఏసు.. ఈస్టర్ రోజు తిరిగి ప్రాణం పోసుకుని ప్రజల మధ్యకు వచ్చారు. మరణంపై ఏసు సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్‌ను పండుగగా జరుపుకుంటారు. క్రైస్తవులు పాటించే లెంట్ సీజన్ కూడా ఈ రోజుతో ముగుస్తుంది. మరణం అనేది జీవితానికి అంతం కాదని.. ఏసు తన జీవితం ద్వారా సందేశమిచ్చారు. ఈస్టర్‌ను కొత్త జీవితం, ఆశ, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు.