News July 10, 2024
భారత్లో పదేళ్లలో 12.5 కోట్ల ఉద్యోగాలు: SBI

FY14 (2013-14) నుంచి FY23 మధ్య భారత్ 12.5కోట్ల ఉద్యోగాలు సృష్టించినట్లు SBI వెల్లడించింది. FY04-14 మధ్య ఈ సంఖ్య 2.9కోట్లకే పరిమితం అయిందని తెలిపింది. మాన్యుఫాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో FY04-14 మధ్య 6.6కోట్ల ఉద్యోగాలు రాగా FY14-23 మధ్య ఆ సంఖ్య 8.9కోట్లుగా ఉన్నట్లు తన నివేదికలో పేర్కొంది. కాగా MSMEల్లో రిజిస్టర్ అయిన ఉద్యోగాల సంఖ్య 20కోట్లు దాటినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
Similar News
News January 19, 2026
వేమన నీతి సూత్రాలు ఎప్పటికీ ఆచరణీయం: CM

AP: సమాజంలో కులమత భేదాలను పారదోలేందుకు యోగి వేమన తన పద్యాలతో చేసిన కృషి చిరస్మరణీయమని CM చంద్రబాబు అన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. విశ్వదాభిరామ వినురవేమ అంటూ ఆయన చెప్పిన నీతి సూత్రాలు ఎప్పటికీ ఆచరణీయమని గుర్తుచేశారు. వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమంటే మనల్ని మనం సన్మార్గంలో నడిపించుకోవడమేనని తెలిపారు.
News January 19, 2026
వరుస ఏడాదుల్లో రూ.200 కోట్లు.. అనిల్ రికార్డు

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయా. ఆయన సినిమా ఫలితాలే దీనిని నిరూపిస్తున్నాయి. ఏడాదిలోనే సినిమాను పూర్తి చేస్తూ వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన MSVPGతోనూ సేమ్ రిజల్ట్స్ రిపీట్ చేశారు. దీంతో వరుస సంవత్సరాల్లో రూ.200CR+ మూవీలు అందించిన తొలి టాలీవుడ్ డైరెక్టర్గా రికార్డులకెక్కారు. అటు వారం రోజుల్లో MSVPG రూ.292Cr కలెక్ట్ చేసింది.
News January 19, 2026
ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా ఇవ్వండి.. SECకి సర్కార్ లేఖ

TG: మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లకు ఆమోదంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ప్రభుత్వం తరఫున సీఎస్ లేఖ రాశారు. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన రిజర్వేషన్ల జాబితాను SECకి పంపారు. దీంతో ఎన్నికలకు ప్రభుత్వం తరఫున ప్రక్రియ ముగిసింది. అటు ఎస్ఈసీ ఇప్పటికే డ్రాఫ్టు షెడ్యూల్ను సీఎంకు అందించింది. దీనికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.


