News July 10, 2024
భారత్‌లో పదేళ్లలో 12.5 కోట్ల ఉద్యోగాలు: SBI
FY14 (2013-14) నుంచి FY23 మధ్య భారత్ 12.5కోట్ల ఉద్యోగాలు సృష్టించినట్లు SBI వెల్లడించింది. FY04-14 మధ్య ఈ సంఖ్య 2.9కోట్లకే పరిమితం అయిందని తెలిపింది. మాన్యుఫాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో FY04-14 మధ్య 6.6కోట్ల ఉద్యోగాలు రాగా FY14-23 మధ్య ఆ సంఖ్య 8.9కోట్లుగా ఉన్నట్లు తన నివేదికలో పేర్కొంది. కాగా MSMEల్లో రిజిస్టర్ అయిన ఉద్యోగాల సంఖ్య 20కోట్లు దాటినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
Similar News
News October 12, 2024
చెడుపై మంచి సాధించిన విజయమే దసరా
అధర్మంపై ధర్మం విజయం సాధించినందుకు దసరాను జరుపుకుంటారు. దీని వెనుక వేర్వేరు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సురులను, ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని దుర్గాదేవి అంతమొందించిన రోజును విజయదశమిగా పిలుస్తారు. సీతను అపహరించిన రావణుడిపై యుద్ధంలో శ్రీరాముడు ఇదే రోజున విజయం సాధించారని పురాణాల్లో ఉంది. చెడు ఎంత భయంకరంగా ఉన్నా అంతిమ విజయం మంచిదేనని ఈ పండుగ చాటి చెబుతోంది.
News October 12, 2024
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి నవనీత్ కౌర్ దూరం!
బీజేపీ నేత నవనీత్ కౌర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోదని భావిస్తున్నట్లు ఆమె భర్త రవి రాణా తెలిపారు. బీజేపీ అధిష్ఠానం ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి నుంచి పోటీ చేసిన నవనీత్ కౌర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు వచ్చే నెల 26తో మహా అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశముంది.
News October 12, 2024
తెలుగు ప్రజలకు చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటామని తెలిపారు. దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలసి మెలసి జీవించాలన్నదే ఈ పండుగ సందేశమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలంతా చల్లగా చూడాలని దుర్గమ్మను ప్రార్థించానని చెప్పారు.