News March 5, 2025

12.9కి.మీ. కేదార్‌నాథ్ రోప్‌వేకు కేంద్రం ఆమోదం

image

చార్‌ధామ్ యాత్రలో కీలకమైన కేదార్‌నాథ్‌కు వెళ్లేందుకు ప్రయాణ కష్టాలు తప్పనున్నాయి. సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ వరకు రూ.4,081 కోట్లతో రోప్‌వే నిర్మించేందుకు PM మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 12.9కి.మీ. మేర రోప్‌వే వల్ల ఓ వైపునకు 8-9 గంటలు పట్టే ప్రయాణ సమయం కేవలం 36నిమిషాలకు తగ్గిపోనుంది. రోప్ వే నిర్మాణంలో ట్రై కేబుల్ డిటాచబుల్ గొండోలా టెక్నాలజీ(3S) ఉపయోగించనున్నారు.

Similar News

News December 3, 2025

క్విక్-C-వార్: మర్చిపోయారా..! మరేం పర్లేదు!!

image

క్విక్ కామర్స్ కంపెనీల పోటీ యుద్ధంతో కస్టమర్లకు మరో కొత్త బెనిఫిట్ రాబోతోంది. Blinkit ‘యాడ్ ఐటమ్స్ ఆఫ్టర్ ఆర్డరింగ్’ ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో వస్తువులు ఆర్డర్ చేశాక అది ప్యాకింగ్ స్టేజ్‌లో ఉంటే మరికొన్ని యాడ్ చేయొచ్చు. క్విక్ మార్కెట్ వాటా పెంచుకునేందుకు ఇప్పటికే జెప్టో ప్రాసెసింగ్, డెలివరీ ఛార్జెస్ తొలగించింది. స్విగ్గీ మ్యాక్స్ సేవర్, ప్రైస్ డ్రాప్ వంటి ఆఫర్స్ తీసుకొచ్చింది.

రిటైర్మెంట్ ప్రకటించిన మోహిత్ శర్మ

image

టీమ్ ఇండియా ప్లేయర్ మోహిత్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 2015లో చివరిసారి అతడు భారత జట్టు తరఫున ఆడారు. మీడియం పేసర్ అయిన ఈ 37 ఏళ్ల బౌలర్ 26 వన్డేల్లో 31 వికెట్లు, 8 టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టారు. IPLలో మోహిత్ CSK, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.