News May 28, 2024

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

image

AP: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న 81,831 మంది వెంకన్నస్వామిని దర్శించుకున్నారు. హుండీకి రూ.4.25 కోట్ల ఆదాయం సమకూరింది.

Similar News

News January 18, 2025

‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్.. రామ్ చరణ్ వ్యాఖ్యలు వైరల్

image

జీవితంలో ఎదురయ్యే అపజయాలను ఎలా ఎదుర్కొంటారనే విషయాన్ని హీరో రామ్ చరణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘జీవితమంటే అనుభవాల పరంపర. తప్పులు తప్పవు. అయితే వాటిని పునరావృతం చేయకుండా ఉండటమే కీలకం. సమయం అన్నింటికీ సమాధానం చెబుతుంది. తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదు. కాలంతో పాటు ప్రతిదీ సరిగ్గా మారుతుంది’ అని ఓ షోలో చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.

News January 18, 2025

భారత జట్టుపై మీ కామెంట్?

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు భారత జట్టును ప్రకటించగా కొందరు క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నితీశ్ రెడ్డితో పాటు కరుణ్ నాయర్‌ను తీసుకోకపోవడంపై విమర్శలకు దిగారు. టీమ్‌కి 15 మందే కావాలని అజిత్ అగార్కర్ అనడంపై సెటైర్లు వేస్తున్నారు. జట్టులో ఉన్నవారంతా అద్భుత ప్లేయర్లేనా? అని ప్రశ్నిస్తున్నారు. యంగ్‌స్టర్లకు అవకాశమివ్వాలని, సెంచరీలు చేసిన కరుణ్‌కు ఛాన్స్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు.

News January 18, 2025

సంజూ శాంసన్‌కు భారీ షాక్?

image

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విజయ్ హజారే ట్రోఫీకి దూరమైన సంజూ శాంసన్‌పై BCCI గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై విచారణ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీకి పక్కన పెట్టింది. అతను సరైన కారణం చెప్పకపోతే ODIలకు పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని BCCI వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది దేశవాళీ క్రికెట్‌కు డుమ్మా కొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయారని గుర్తు చేశాయి.