News January 18, 2025

‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్.. రామ్ చరణ్ వ్యాఖ్యలు వైరల్

image

జీవితంలో ఎదురయ్యే అపజయాలను ఎలా ఎదుర్కొంటారనే విషయాన్ని హీరో రామ్ చరణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘జీవితమంటే అనుభవాల పరంపర. తప్పులు తప్పవు. అయితే వాటిని పునరావృతం చేయకుండా ఉండటమే కీలకం. సమయం అన్నింటికీ సమాధానం చెబుతుంది. తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదు. కాలంతో పాటు ప్రతిదీ సరిగ్గా మారుతుంది’ అని ఓ షోలో చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.

Similar News

News February 9, 2025

కాంగ్రెస్, BRS మధ్య ఒప్పందం: బండి సంజయ్

image

TG: కాంగ్రెస్, BRSవి కాంప్రమైజ్ పాలిటిక్స్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతలను అరెస్టు చేయకుండా ఉండేందుకు BRS ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉందన్నారు. ఎంఐఎం ఒత్తిడితోనే ముస్లింలను బీసీల్లో కలిపారని, బీసీ సంఘాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

News February 9, 2025

UP వారియర్స్ కెప్టెన్‌గా దీప్తి శర్మ

image

WPLలో యూపీ వారియర్స్ కెప్టెన్‌గా భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మను ఆ ఫ్రాంచైజీ నియమించింది. గత సీజన్‌లో దీప్తి ఆ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 27 ఏళ్ల దీప్తి భారత్ తరఫున 124 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. WPLలో 17 మ్యాచులు ఆడి 385 పరుగులు, 19 వికెట్లు సాధించారు.

News February 9, 2025

మరణాల్ని పుతిన్‌ ఆపాలనుకుంటున్నారు: ట్రంప్

image

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ కాల్ మాట్లాడానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘మా ఇద్దరి మధ్య ఎన్నిసార్లు ఫోన్ కాల్ సంభాషణ జరిగిందనేది ప్రస్తుతానికి రహస్యం. కానీ అమాయకుల ప్రాణాలు పోకుండా ఆపాలని పుతిన్ కూడా కోరుకుంటున్నారు. యుద్ధాన్ని ఆపేందుకు మంచి ప్రణాళిక ఉంది. వచ్చేవారం ఉక్రెయిన్‌లో పర్యటించి ఆ దేశాధ్యక్షుడితో భేటీ అవుతా’ అని స్పష్టం చేశారు.

error: Content is protected !!