News March 25, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఇవాళ శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 80,532 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,438 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Similar News

News November 23, 2025

MNCL: DCC అధ్యక్షుడు రఘునాథరెడ్డి రాజకీయ ప్రస్థానం

image

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన పిన్నింటి రఘునాథరెడ్డి రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. 1990లో ఎన్ఎస్‌యూఐ పాఠశాల అధ్యక్షుడిగా, 2004-2006 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 2007 నుంచి 2012 వరకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆపై 2013-2023 వరకు టీపీసీసీ కార్యదర్శిగా, 2023 నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు.

News November 23, 2025

సామ్ కరన్ ఎంగేజ్‌మెంట్

image

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్‌ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్‌లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.

News November 23, 2025

పిల్లలు బరువు తగ్గుతున్నారా?

image

పిల్లలు పుట్టినప్పుడు సరైన బరువుతో ఉన్నా ఆ తర్వాత బరువు తగ్గిపోతున్నారని చాలామంది పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది సాధారణమే అంటున్నారు నిపుణులు. పుట్టినప్పుటి బరువులో 6-7 శాతం వరకు తగ్గుతారట. డబ్బా పాలు తాగేవారిలో 3-4 శాతం తగ్గుదల కనిపిస్తుంది. చిన్నారులు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే ఐదు నుంచి ఆరు నెలల తర్వాత రెట్టింపు బరువు పెరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు.