News May 3, 2024
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో గత రెండు రోజులుగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 65,313 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,780 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Similar News
News October 7, 2025
పుతిన్కు మోదీ బర్త్డే విషెస్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బర్త్డే సందర్భంగా ప్రధాని మోదీ ఫోన్ చేసి విషెస్ తెలియజేశారు. భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఇరువురు నేతలూ ఆకాంక్షించారు. పుతిన్ భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. కాగా ఈ ఏడాది డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు ఇండియాలో పర్యటించనున్నారు.
News October 7, 2025
సమ్మక్క-సారక్క యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ

TG: ములుగులో ఏర్పాటయ్యే సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆదివాసీ-గిరిజనుల ఆత్మ ప్రతిబింబించేలా లోగో డిజైన్ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. గిరిజన సమాజానికి ఇది ప్రతిష్ఠాత్మక విద్యా వేదిక అవుతుందని ధర్మేంద్ర అన్నారు. లోగోలో సమ్మక్క, సారక్కల పసుపు బొమ్మలు, ఎర్రటి సూర్యుడు, నెమలి ఈకలు, జంతువు కొమ్ములు తదితరాలున్నాయి.
News October 7, 2025
కర్ణాటకలో కులగణన.. స్కూళ్లకు 10 రోజుల సెలవులు

కులగణన సర్వే నేపథ్యంలో కర్ణాటక CM సిద్దరామయ్య రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లకు 10 రోజులు సెలవులు ప్రకటించారు. రేపటి నుంచి ఈనెల 18 వరకు మూసివేయనున్నట్లు తెలిపారు. సర్వేలో టీచర్లు పాల్గొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కులగణన ఇవాళే ముగియాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల మరో 10 రోజులు పొడిగించారు. అటు సర్వే చేస్తున్న ముగ్గురు సిబ్బంది మరణించగా రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.