News May 3, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

image

తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో గత రెండు రోజులుగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 65,313 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,780 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Similar News

News November 14, 2024

భయపెట్టిన క్లాసెన్, జాన్సెన్

image

భారత్, సౌతాఫ్రికా మధ్య 3వ టీ20 తీవ్ర ఉత్కంఠగా సాగింది. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ 41(22 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు), మార్కో జాన్సెన్ 54(17బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) భారత బౌలర్లకు చెమటలు పట్టించారు. చక్రవర్తి వేసిన 14వ ఓవర్‌లో క్లాసెన్ హ్యాట్రిక్ సిక్సులతో మొత్తం 22 రన్స్ కొట్టారు. హార్దిక్ వేసిన 19వ ఓవర్లో జాన్సెన్ (4, 6, 4, 2, 6, 4) మొత్తం 26 రన్స్ బాదారు. వీరు ఔటవడంతో భారత్ <<14604651>>గెలిచింది<<>>.

News November 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 14, 2024

BREAKING: ఉత్కంఠ పోరులో భారత్ విజయం

image

సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 219/6 స్కోర్ చేయగా ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 208/7 చేసింది. దీంతో భారత్ 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సెంచరీ(107)తో రాణించారు. కాగా 4 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యం సాధించింది. తర్వాతి మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది.