News February 10, 2025

కుంభమేళాలో 12 మంది జననం.. పేర్లు ఇవే

image

మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటుచేసిన సెంట్రల్ హాస్పిటల్‌లో 12 మంది మహిళలు బిడ్డలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు. అన్నీ సాధారణ కాన్పులేనని చెప్పారు. వీరిలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాలవారు ఉన్నారన్నారు. ఆడపిల్లలకు బసంతి, గంగా, జమున, బసంత్ పంచమి, సరస్వతి, మగ బిడ్డలకు కుంభ్, భోలేనాథ్, బజ్‌రంగీ, నంది తదితర పేర్లు పెట్టినట్లు వివరించారు.

Similar News

News November 12, 2025

పిల్లలు ఎక్కువసేపు కూర్చొనే ఉంటున్నారా?

image

బాల్యంలో ఎక్కువసేపు కదలకుండా కూర్చొనేవారికి పెద్దయ్యాక గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్టర్న్‌ ఫిన్‌లాండ్‌ అధ్యయనం హెచ్చరిస్తోంది. బరువు, రక్తపోటు మామూలుగానే ఉన్నా కూర్చొనే సమయం పెరుగుతున్నకొద్దీ గుండెజబ్బు, పక్షవాతం, మరణం ముప్పు రెండింతలు ఎక్కువవుతోంది. కాబట్టి పిల్లలను వీలైనంత వరకు చురుకుగా ఉండేలా ప్రోత్సహించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

News November 12, 2025

టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్‌గా మారిన ధర్మారెడ్డి?

image

AP: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ EO ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తోంది. బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అన్నీ జరిగినట్లు ఆయన అంగీకరించారని సమాచారం. CBI సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో ధర్మారెడ్డి కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

News November 12, 2025

విదేశీ ఉద్యోగుల అవసరం ఉంది: ట్రంప్

image

H-1B వీసా జారీలో తెచ్చిన సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటమార్చారు. తమ దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయాలంటే ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరముందని పేర్కొన్నారు. అనుకున్న స్థాయిలో నైపుణ్యం కలిగిన వాళ్లు అమెరికాలో లేరని అంగీకరించారు. జార్జియాలోని రక్షణ రంగానికి చెందిన పరిశ్రమ నుంచి కార్మికులను తొలగించడంతో ఉత్పత్తుల తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.