News September 17, 2024
వారి ఖాతాల్లో ఏడాదికి రూ.12,000
TG: భూమి లేని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.12 వేలు జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం(D) నాగులవంచలో దళిత బంధు 2వ విడత లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేశారు. త్వరలోనే పేదలకు ఇళ్లు ఇస్తామన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించకపోతే రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్లేనని పేర్కొన్నారు.
Similar News
News October 11, 2024
నందిగం సురేశ్‌కు అస్వస్థత
AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. లో బీపీ, భుజం, ఛాతీలో నొప్పి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో జైలు అధికారులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్‌కు న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
News October 11, 2024
డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేజ్రీవాల్
అధికారంలోకొస్తే ఏడాదిలోపు విద్యుత్ ఛార్జీలను సగానికి తగ్గిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై EX CM కేజ్రీవాల్ స్పందించారు. ‘ఉచితాలు అమెరికా వరకు చేరుకున్నాయి’ అని ట్వీట్ చేశారు. అయితే, NDA పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమలు చేస్తే BJP తరఫున ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ ఇటీవల సవాల్ విసిరారు. తాజాగా ట్రంప్ ప్రకటనపై స్పందించడం వెనుక ఆయన BJPని టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.
News October 11, 2024
జపాన్ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం
2024 ఏడాదికి గానూ నోబెల్ శాంతి బహుమతి జపనీస్ సంస్థ నిహాన్ హిడాంక్యోను వరించింది. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్టు కమిటీ ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 111 మంది సభ్యులు, 31 సంస్థలను నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ ఏడాది పురస్కారానికి 286 నామినేషన్లను పరిశీలించిన కమిటీ నిహాన్ హిడాంక్యోను పురస్కారానికి ఎంపిక చేసింది.