News May 25, 2024
13.32 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం: తుమ్మల

TG: రాష్ట్రంలో ప్రస్తుతం 13,32,827 క్వింటాళ్ల సన్నరకం వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గతేడాది కంటే ఈసారి 15.75 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అధికంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వర్షాల కారణంగా డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ పచ్చిరొట్ట విత్తనాలను సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
Similar News
News February 18, 2025
Stock Markets: భారీ నష్టాల నుంచి తేరుకొని..

స్టాక్‌మార్కెట్లు నేడు ఆటుపోట్లకు లోనయ్యాయి. ఉదయం భారీగా నష్టపోయిన సూచీలు ఆఖరికి కోలుకున్నాయి. నిఫ్టీ 22,945 (-14), సెన్సెక్స్ 75,967 (-29) వద్ద ముగిశాయి. ఐటీ, O&G సూచీలు ఎగిశాయి. రియాల్టి, మెటల్, ఫైనాన్స్ సూచీలు ఫ్లాటుగా ముగిశాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఫార్మా, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు విలవిల్లాడాయి. ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, విప్రో, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్ టాప్ గెయినర్స్.
News February 18, 2025
VVIP చాపర్ కేస్: మధ్యవర్తికి బెయిల్

అగస్టా వెస్ట్‌లాండ్ చాపర్ కేసులో బ్రిటన్ మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైకేల్‌కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. CBI కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకొని సబ్మిట్ చేయాలని ఆదేశించింది. పిటిషనర్ ఆరేళ్లుగా కస్టడీలో ఉన్నారని, సప్లిమెంటరీ సహా 3 ఛార్జిషీట్లను CBI దాఖలు చేసిందని గుర్తుచేసింది. ట్రయల్ కోర్టు నిర్దేశించిన ఆంక్షలకు లోబడి, అనారోగ్య కారణాలతో ఊరటనిచ్చింది.
News February 18, 2025
‘బిచ్చగాడిలా చూశాడు.. అందుకే తాతను చంపేశా’

పారిశ్రామికవేత్త, వెల్‌జన్ గ్రూప్ అధినేత జనార్దన్ రావు దారుణ <<15406329>>హత్య<<>> కేసులో HYD పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. తనను తాత బిచ్చగాడిగా చూశాడని, అందుకే విసిగిపోయి చంపేశానని విచారణలో జనార్దన్ రావు మనుమడు కీర్తితేజ తెలిపాడు. ‘మా తాత మిగతావారితో సమానంగా నన్ను చూడలేదు. అందరిముందు హేళన చేసేవాడు. ఆస్తులే కాకుండా, సంస్థలో ఏ పదవీ ఇవ్వలేదు’ అని అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.