News April 24, 2025
వరంగల్‌లో లొంగిపోయిన 14మంది మావోయిస్టులు

TG: వరంగల్‌లో 14మంది మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ‘మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తున్నాం. అది మంచి ఫలితాల్ని ఇస్తోంది. ఈ ఏడాది 250మంది లొంగిపోయారు. వారికి రూ.25 వేలు అందిస్తున్నాం. ఏ రాష్ట్రానికి చెందిన వారు లొంగిపోయినా మా సహకారం అందిస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.
Similar News
News April 24, 2025
టెన్త్ రిజల్ట్స్.. కవలలకు ఒకే మార్కులు

AP: పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కవలలు టెన్త్ ఫలితాల్లో సాధించిన మార్కులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బలిజిపేట (M) వంతరాం గ్రామానికి చెందిన బెవర శ్రవణ్, బెవర సింధు కవలలు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివారు. నిన్న విడుదలైన ఫలితాల్లో ఇద్దరికీ 582 చొప్పున మార్కులు రాగా, స్థానికంగా ఈ విషయం ఆసక్తి రేపింది. మంచి మార్కులు సాధించినందుకు వీరి తల్లిదండ్రులు ఉమా, రాము సంతోషపడ్డారు.
News April 24, 2025
ఫిట్జీ కోచింగ్ సెంటర్లపై ఈడీ దాడులు

ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లోని ఫిట్జీ కోచింగ్ సెంటర్లపై ఈడీ దాడులు చేపట్టింది. ఏకకాలంలో మొత్తం 8 చోట్ల సోదాలు నిర్వహించింది. ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు PMLA కింద కేసు నమోదు చేసింది. ఫిట్జీ తమకు సంబంధించిన కొన్ని కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేయడం ద్వారా రూ.11.11 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు చేపట్టింది. మనీ లాండరింగ్‌కు కూడా పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది.
News April 24, 2025
పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల

AP: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) పాలిసెట్-2025 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు https://polycetap.nic.in సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు కేవలం ఆన్లైన్ విధానంలోనే అందుబాటులో ఉంటాయని, పోస్ట్ లేదా ఇతర ఆఫ్‌లైన్ పద్ధతుల్లో పంపబోమని అధికారులు స్పష్టం చేశారు.