News April 24, 2025
వరంగల్‌లో లొంగిపోయిన 14మంది మావోయిస్టులు

TG: వరంగల్‌లో 14మంది మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ‘మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తున్నాం. అది మంచి ఫలితాల్ని ఇస్తోంది. ఈ ఏడాది 250మంది లొంగిపోయారు. వారికి రూ.25 వేలు అందిస్తున్నాం. ఏ రాష్ట్రానికి చెందిన వారు లొంగిపోయినా మా సహకారం అందిస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.
Similar News
News April 19, 2026
శ్రీకాకుళం: అసలు సూత్రధారులెవరో..?

ఈ ఏడాది రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసుల వ్యవహారం వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. వీటి ముద్రణలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి<<19679785>> ఆరుగురిపై<<>> కేసు నమోదు చేశారు. అసలు ఈ పాసులను ముద్రించమన్నదెవరూ? ఇవి బయటికెలా వచ్చాయనే విషయాలను వెల్లడించకపోవడంతో అసలు నిందితులను రాజకీయ ఒత్తిడితో దాచిపెట్టారనే ఆరోపణలోస్తున్నాయి. తెర వెనక పాత్రదారులను పట్టుకోవాలని భక్తుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
News April 19, 2026
భారత అంతరిక్ష రంగంలో చరిత్రాత్మక మలుపు ‘ఆర్యభట్ట’

భారత తొలి కృత్రిమ ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను 1975లో ఇదే రోజు రష్యాలోని కాపుస్తిన్ యార్ ప్రయోగకేంద్రం నుంచి ఇస్రో చేపట్టింది. X-RAY ఖగోళ శాస్త్రం, ఏరోనమీ, సోలార్ ఫిజిక్స్‌పై ప్రయోగాలు చేసే ఉద్దేశంతో ప్రయోగించింది. 5 రోజులపాటు విజయవంతంగా పనిచేసిన ఈ శాటిలైట్ దాదాపు 17yrs తర్వాత భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఆనాడు వేసిన ఈ చిన్న అడుగే నేడు స్పేస్ రంగంలో భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపింది.
News April 19, 2026
కేజీ చికెన్ ధర ఎంతంటే?

హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ఏరియాను బట్టి రూ.270 నుంచి రూ.280 వరకు అమ్ముతున్నారు. వరంగల్‌లో రూ.270, కామారెడ్డి రూ.270, ఖమ్మంలో రూ.280కి విక్రయిస్తున్నారు. ఏపీలోని విజయవాడలో రూ.230, పల్నాడులో రూ.250-రూ.280, కర్నూలులో రూ.260, నంద్యాలలో రూ.280గా ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


