News April 15, 2024

14వేలమంది తొలగింపు.. టెస్లా నిర్ణయం

image

తమ ఉద్యోగులకు కార్ల తయారీ సంస్థ టెస్లా షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాఫ్‌లో 14వేలమందిని తొలగించాలని నిర్ణయించింది. గత డిసెంబరు నాటికి ఆ సంస్థలో 1.40 లక్షలమంది పనిచేస్తున్నారు. తాజా నిర్ణయంతో వారిలో 14వేలమందిపై ప్రభావం పడనుంది. ఏ విభాగాల వారిని తొలగిస్తున్నదీ సంస్థ వివరించలేదు. గత కొన్ని నెలలుగా టెస్లా అమ్మకాలు బాగా తగ్గడంతో ఖర్చును అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Similar News

News November 17, 2024

ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ పరిశోధన!

image

97 ఏళ్లుగా కొనసాగుతూ ప్రపంచంలోనే సుదీర్ఘమైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన పరిశోధన ఇది. ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త థామస్ పార్నెల్ 1927లో ‘పిచ్ డ్రాప్’ అనే పరిశోధన ప్రారంభించారు. తారు నుంచి లభ్యమయ్యే ‘పిచ్’ ద్రవం అత్యంత చిక్కగా ఉంటుంది. దాని చిక్కదనాన్ని కొలిచేందుకు వేడి చేసి గరాటులో పోస్తే 97 ఏళ్లలో 9 చుక్కలే బయటికొచ్చాయి. గరాటు నుంచి మొత్తం పిచ్ ఖాళీ అయ్యేందుకు మరో వందేళ్లు పడుతుందని అంచనా.

News November 17, 2024

డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం ఏం చేస్తోంది: ఖ‌ర్గే

image

మ‌ణిపుర్‌లో మ‌ళ్లీ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డంపై డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ BJPని కాంగ్రెస్ నిలదీసింది. బీజేపీ పాలనలో ‘మ‌ణిపుర్ ఐక్యంగా లేదు, సుర‌క్షితంగా లేదు’ అని ఖ‌ర్గే విమర్శించారు. 2023 నుంచి జరుగుతున్న హింస ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తును నాశనం చేస్తోంద‌న్నారు. ద్వేషపూరిత రాజ‌కీయాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న ఉద్దేశంతో మ‌ణిపుర్ త‌గ‌ల‌బ‌డాల‌ని BJP చూస్తోందని ఖర్గే ఆరోపించారు.

News November 17, 2024

ఎక్కువ సేపు కూర్చుంటే త్వరగా ముసలితనం

image

ఎక్కువ సేపు కుర్చీకి అతుక్కుపోయి పనిచేస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయనేది అందరికీ తెలిసిందే. వీరిలో అకాల వృద్ధాప్యం, గుండె జబ్బులు, మానసిక సమస్యలు వస్తాయని US సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. దాదాపు 1,000 మందిపై వీరు పరిశోధన చేశారు. పని తర్వాత నామమాత్రపు వాకింగ్ చేస్తే సరిపోదని, తీవ్రత ఉండాలని అంటున్నారు. రోజూ 30min రన్నింగ్/సైక్లింగ్ చేసే వారి వయసు 5-10ఏళ్లు తక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు.