News November 17, 2024

ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ పరిశోధన!

image

97 ఏళ్లుగా కొనసాగుతూ ప్రపంచంలోనే సుదీర్ఘమైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన పరిశోధన ఇది. ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త థామస్ పార్నెల్ 1927లో ‘పిచ్ డ్రాప్’ అనే పరిశోధన ప్రారంభించారు. తారు నుంచి లభ్యమయ్యే ‘పిచ్’ ద్రవం అత్యంత చిక్కగా ఉంటుంది. దాని చిక్కదనాన్ని కొలిచేందుకు వేడి చేసి గరాటులో పోస్తే 97 ఏళ్లలో 9 చుక్కలే బయటికొచ్చాయి. గరాటు నుంచి మొత్తం పిచ్ ఖాళీ అయ్యేందుకు మరో వందేళ్లు పడుతుందని అంచనా.

Similar News

News April 16, 2026

ఆన్‌లైన్‌లో అమ్మాయిల సెక్సువల్ వీడియోలు.. వెలుగులోకి సంచలన విషయం

image

MHలో 180మంది <<19654021>>అమ్మాయిల<<>> లైంగిక వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఎక్కువ మంది అమ్మాయిలను ఎవరు ట్రాప్ చేస్తారో చూద్దామా?’ అంటూ నిందితుడు అహ్మద్, మరో యువకుడు ఉజెర్ ఖాన్‌ పందెం కాచుకున్నారు. దీంతో అమ్మాయిలను ట్రాప్ చేసి లైంగిక కోరికలు తీర్చుకునేవారు. ఇద్దరి మధ్య డబ్బు వివాదంతో ఉజెర్ ఆ వీడియోలను SMలో పోస్ట్ చేశాడు.

News April 16, 2026

పచ్చిపాలు.. చర్మానికి చేసేను మేలు

image

☛ పచ్చి పాలు, తేనె కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కాటన్ బాల్స్‌తో శుభ్రం చేసుకోవాలి. కొద్ది సేపటికి చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.
☛ పచ్చి పాలలో అరటి పండును కలిపితే అది చర్మానికి మరింత మేలు చేస్తుంది. దీని కోసం కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.

News April 16, 2026

క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? ఈ 30% రూల్ మర్చిపోవద్దు!

image

ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనే దానికంటే వాటిని ఎంత వాడుతున్నారనేది ముఖ్యం. మొత్తం క్రెడిట్ లిమిట్‌లో 30% లోపే ఖర్చు చేయాలని నిపుణుల సూచన. మీ దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయనుకుందాం. మొదటి దాని లిమిట్ ₹1,00,000, రెండో కార్డు లిమిట్ ₹50,000. ఇప్పుడు 30% రూల్ ప్రకారం రెండింటిపై ఖర్చు ₹45,000 దాటొద్దు. లేదంటే క్రెడిట్ స్కోరు తగ్గే అవకాశం ఉంది. బ్యాంకులు మిమ్మల్ని ‘అప్పుల కోసం ఆశపడే వ్యక్తి’గా చూస్తాయి.