News November 30, 2024
రామప్ప, సోమశిలకు రూ.142 కోట్లు: కిషన్ రెడ్డి
TG: యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎస్ఏఎస్సీఐ స్కీమ్తో రెండింటిని డెవలప్ చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కాగా ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు 23 రాష్ట్రాల్లో 40 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది.
Similar News
News November 30, 2024
ఏపీలో కొత్తగా 88 పీహెచ్సీలు
AP: రాష్ట్రంలో 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంటులో తెలిపారు. PHCల్లో 72 మంది స్టాఫ్ నర్సులకు 68 మందిని, 45 మంది వైద్యులకు 42 మందిని నియమించినట్లు చెప్పారు. జిల్లా అర్బన్ పీహెచ్సీల్లో 97 మంది స్టాఫ్ నర్సులకు 86 మందిని, 49 మంది వైద్యులకు 48 మందిని నియమించినట్లు వెల్లడించారు.
News November 30, 2024
నేడు పింఛన్ల పంపిణీ
AP: రేపు(ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. సీఎం చంద్రబాబు అనంతపురంలోని నేమకల్లులో లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయనున్నారు. CBN ఉ.11.40 గంటలకు గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయం బయల్దేరుతారు. 12.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు నుంచి నేమకల్లుకు వెళ్తారు. గ్రామ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్ల పంపిణీ చేస్తారు.
News November 30, 2024
నేడు భారత్ VS పాకిస్థాన్ మ్యాచ్
అండర్-19 ఆసియా కప్లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. భారత జట్టుకు మహ్మద్ అమన్ సారథ్యం వహిస్తున్నారు. జట్టులో IPL వండర్ 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నారు. U19 ఆసియా కప్లో ఇరు జట్లు ఇప్పటి వరకు 3సార్లు తలపడగా భారత్ 2 సార్లు, పాక్ ఒకసారి గెలుపొందాయి. ఉదయం 10.30 గంటలకు సోనీ స్పోర్ట్స్లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. తొమ్మిదో టైటిల్ బరిలో భారత్ బోణీ కొట్టాలని చూస్తోంది.